Skip to main content

NEET Ranks: నీట్‌లో రాష్ట్రం నుంచి 44,629 మందికి ర్యాంకులు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

సాక్షి, హైదరాబాద్‌: నీట్‌ యూజీ ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం జూలై 3న విడుదల చేసింది.
NEET Ranks
నీట్‌లో రాష్ట్రం నుంచి 44,629 మందికి ర్యాంకులు.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

నీట్‌ ర్యాంకుల వారీగా అభ్యర్థుల వివరాలు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నుంచి రాష్ట్రానికి అందాయి. నీట్‌ పరీక్ష దరఖాస్తు సమయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారుగా అభ్యర్థులు ఇచ్చిన వివరాల ఆధారంగానే ఈ జాబితా ప్రకటించారు. వీటిని నీట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులుగానే పరిగణిస్తున్నారు. అయితే, కట్‌ ఆఫ్‌ మార్కుల ఆధారంగా ఈ ర్యాంకుల్లో కొద్దిగా మార్పులు చేర్పులు జరగొచ్చని వర్సిటీ ప్రకటించింది. తెలంగాణ నుంచి 72,842 మంది నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 107 కట్‌ ఆఫ్‌ మార్క్‌ అర్హత ఉండటంతో అంతవరకు ఎంతమంది ఉంటే వారందరి జాబితాను కాళోజీ వర్సిటీ ప్రకటించింది.

ఈ మేరకు మొత్తం 44,629 మంది జాబితాను వెల్లడించింది. అయితే జనరల్‌ కేటగిరీల్లో ఉన్నవారి కట్‌ ఆఫ్‌ మార్క్‌ 137, దివ్యాంగుల కట్‌ ఆఫ్‌ మార్క్‌ 121 ఉంది. ఈ జాబితాలో 107 వరకు కట్‌ ఆఫ్‌ మార్క్‌ సాధించిన జనరల్‌ కేటగిరీ, దివ్యాంగులకు చెందిన అభ్యర్థుల వివరాలను కూడా విశ్వవిద్యాలయం ప్రకటించింది. కాబట్టి జాబితాలో ఉన్నవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలయితే 107 కట్‌ ఆఫ్‌ మార్క్‌ చూసుకోవాల్సి ఉంటుంది. జనరల్‌ విద్యార్థులు 137, దివ్యాంగులైతే 121 వరకు కట్‌ ఆఫ్‌ మార్కు ఉంటేనే అర్హులుగా భావించాలని వర్సిటీ తెలిపింది.  

చదవండి: Telangana NEET UG 2023 Top 10 Rankers : తెలంగాణ నీట్ యూజీ-2023 ర్యాంకులు విడుద‌ల‌.. టాప్‌-10 ర్యాంక‌ర్లు వీరే..

స్టేట్‌ టాప్‌ ర్యాంకర్‌ రఘురామరెడ్డి.. 

రాష్ట్రంలో నీట్‌ పరీక్ష రాసిన కె.జి.రఘురామరెడ్డి తెలంగాణ నుంచి నీట్‌ టాప్‌ ర్యాంకర్‌గా నిలిచారు. ఆయనకు 715 మార్కులు రాగా, జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించారు. అలాగే రెండో ర్యాంకు జాగృతి బోడెద్దుల సాధించారు. ఆమె 710 మార్కులతో జాతీయ స్థాయిలో 49వ ర్యాంకు సాధించారు. లక్ష్మి రస్మిత గండికోట 710 మా­ర్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించా­రు. జాతీయ స్థాయిలో ఆమె 52వ ర్యాంకు సాధించారు. కాగా, ఈ జాబితా సమాచారం నిమిత్తమేనని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు యూనివర్సిటీ మొదట రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది.

అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం యూనివర్సిటీ మెరిట్‌ జాబితాను విడుదల చేస్తుంది. రాష్ట్రంలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు వీలుగా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని కాళోజీ వర్సిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అయితే ఈసారి కౌన్సిలింగ్‌ ప్రక్రియలో మార్పు చేసే అవకాశముందని అంటున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి జాతీయ కౌన్సెలింగ్, రాష్ట్రాల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 7న జాతీయ స్థాయిలో నీట్‌ అర్హత పరీక్ష నిర్వహించగా, జూన్‌ 13న ఫలితాలు ప్రకటించారు. 

నీట్‌లో రాష్ట్రస్థాయి  టాప్‌ 10 ర్యాంకర్లు

స్టేట్‌ ర్యాంకు

పేరు

మార్కుల స్కోరింగ్‌

1

కె.జి.రఘురామరెడ్డి

715

2

జాగృతి బోడెద్దుల

710

3

లక్ష్మి రస్మిత గండికోట

710

4

గిలాడ ప్రాచి

710

5

దేవగుడి గురు శశిధర్‌రెడ్డి

710

6

తెల్లా వరుణ్‌రెడ్డి

705

7

చిన్మయి వుప్పల

705

8

లక్షన్య ఆదికేశవన్‌

705

9

జక్కె సుధీక్ష

705

10

వేమూరి సుహిత్‌

705

Published date : 04 Jul 2023 05:02PM

Photo Stories