Guest Faculty: వేతన వెతలు.. ఐదు నెలలుగా అందని వేతనాలు
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఓతో వీరి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. పదేళ్ల క్రితం గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రభుత్వం నియమించింది. పేరుకు పార్ట్ టైం అయిన ఏనాటికైన వారి ఉద్యోగం క్రమబద్ధీకరణ జరుగుతుందని ఎదురుచూసినా.. వారి ఆశలు అడిఆశలుగానే మరాయి.
అటు నెలల తరబడి జీతాలు రాక క్రమబద్ధీకరణ జరగక ఇటు మరోచోట ఉపాధి దొరికే అవకాశాలు లేక ఇబ్బందులు పడు తున్నారు. జిల్లాలోని 7 ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో మొత్తం 42 మంది గెస్ట్ లెక్చరర్లుగా పని చేస్తున్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో తక్కువ శాతం విధ్యార్థులు హాజరు అవుతుండగా గెస్ట్ లెక్చరర్‌లను విధుల్లోకి తీసుకోవద్దని ఉన్నతాధికారులు సంకేతాలు ఇచ్చారు. అయిన ప్రభుత్వం షరతులతో కొత్త జీఓ తీసుకొచ్చి మళ్లీ విధులుల్లోకి తీసుకున్నారు.
చదవండి: Navodaya Admissions 2025-26: ఆన్‌లైన్‌లో నవోదయ దరఖాస్తుల స్వీకరణ
ఐదు నెలలుగా అందని వేతనాలు
ప్రస్తుతం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న అతిథి అధ్యాపకులకు గత సంవత్సరం రెండు నెలలు విధులు నిర్వహించినవి, ప్రస్తుత ఏడాది 3 నెలల వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీంతో ఇళ్లు గడవక అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో 42 మంది గెస్ట్ లెక్చరర్స్ ఉండగా ఒక్కొక్కరు నెలకు 72 తరగతులు బోధించాల్సి ఉంటుంది. క్లాస్‌కు రూ.300 చొప్పున నెలకు రూ.21,600 వేతనంగా చెల్లిస్తున్నారు.
జిల్లాలో 2012 నుంచి అతిథి అధ్యాపకుల వ్యవస్థ కొనసాగుతుంది. గతంలో క్లాసుకు రూ.150 చెల్లించగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2017 నుంచి రూ.300 చెల్లిస్తున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
కొత్త జీఓతో తీవ్ర నష్టం
పదేళ్ల క్రితం ప్రభుత్వం ఆయా కళాశాలల్లో ఖాళీలను బట్టి గెస్ట్ ఫ్యాకల్టీని నియమించారు. కళాశాల అభివృద్ధికి రెగ్యులర్ వారితో సమానంగా పని చేస్తూ విద్యార్థుల ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ కీలకంగా పని చేస్తున్నారు.
ఈ విద్యాసంవత్సరం కూడా పాత అధ్యాపకులనే కొనసాగించాలని ప్ర భుత్వ ఆదేశాలు రావడంతో మళ్లీ వారినే విధుల్లోకి తీసుకున్నారు. అయితే కొత్త జీఓతో వారి ఉపాధికి భరోసా లేకుండా పోయిందని, రెగ్యులర్ అధ్యాపకులు వచ్చే వరకే విధులు నిర్వహించాలని, ఎప్పుడు ఉద్యోగం మానేయాలన్న అప్పుడు తొలగిపోవాలని పలు షరతులతో విధుల్లోకి తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కుటుంబాలు రోడ్డున పడకుండా ఎప్పటిలాగే కొనసాగించాలని అతిథి అధ్యాపకులు కోరుతున్నారు.
జిల్లాలో అతిథి అధ్యాపకుల వివరాలు
కళాశాల |
అధ్యాపకుల సంఖ్య |
జనగామ జూనియర్ కళాశాల |
8 |
జనగామ బాలికల కళాశాల |
6 |
దేవరుప్పుల |
6 |
నర్మెట |
5 |
దేవరుప్పుల |
6 |
కొడకండ్ల |
4 |
జఫర్‌గఢ్ |
2 |
స్టేషన్‌ఘణపురం |
5 |