JNTUA: పీహెచ్‌డీకి దరఖాస్తుల ఆహ్వానం
కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో పనిచేసే వారు, ఆర్‌అండ్‌డీ సంస్థల్లో పనిచేసే సైంటిస్టులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి పదవుల్లో ఉండే ప్రజాసేవకులు అర్హులని పేర్కొన్నారు. మాస్టర్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు లేదా 6.0 సీజీపీఏ సాధించి ఉండాలని తెలిపారు.
చదవండి: Jagadesh Kumar: పరిశోధనలతో సమాజానికి మేలు.. ఉద్యోగం కోసం కాకుండా ఆసక్తితో రావాలి
సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజినీరింగ్, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణితం, మేనేజ్‌మెంట్, ఫార్మా, ఆంగ్లం, ఫుడ్ టెక్నాలజీ విభాగాల్లో పీహెచ్‌డీ చేయడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్సిటీ అనుబంధ కళాశాలలే కాకుండా గుర్తించిన 12 రీసెర్చ్ సెంటర్లలోనూ పీహెచ్‌డీ చేయొచ్చని తెలిపారు.
రూ.5 వేల డీడీ, సంబంధిత సర్టిఫికెట్లు జత చేసి దరఖాస్తులను సెప్టెంబర్ 4లోగా డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూకు చేర్చాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.jntua.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.