Success Story: అమెరికాలో అదరగొడుతున్న భారతీయ మహిళ... వందల కోట్ల వ్యాపారంతో పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న జోయా
అయితే ఈ రోజు మహిళ అడుగుపెట్టని రంగం ఏదీ లేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఈ రోజు అన్ని రంగాల్లోనూ మహిళల హవా నడుస్తోంది. మహిళలకు పూర్తిగా విరుద్ధంగా భావించే వైన్ ఇండస్ట్రీలో కూడా మేము సైతం అంటున్నారు. ఇలాంటి రంగంలో అడుగు పెట్టి ప్రపంచ వ్యాపార రంగంలో ఎంతోమంది దృష్టిని ఆకర్శించి 'జోయా వోరా షా' .
Success Story: వరుసగా నాలుగు సార్లు ఫెయిల్...ఏడేళ్ల నిరీక్షణ.. చివరికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...
అమెరికాలోని ప్రముఖ వైన్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో ముందుకెళ్తున్న 'జోయా వోరా షా' భారతదేశానికి చెందిన మహిళ కావడం గమనార్హం. నిజానికి ఈమె కొంత కాలం క్రితం మన దేశం నుంచి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడింది. కొన్ని రోజుల తరువాత ఒక రెస్టారెంట్‌లో వైన్ బిజినెస్ ప్రారంభించింది. ఈ వ్యాపారం అతి తక్కువ కాలంలోనే బాగా లాభాల బాట పట్టింది.
☛ IAS Success Story: వరుసగా మూడు సార్లు ఫెయిల్.. తర్వాత ఐఆర్ఎస్.. ఐఎఫ్ఎస్.. ఐఏఎస్ సాధించిన సూర్యభాన్ సక్సెస్ స్టోరీ
ఒక బ్రాంచ్‌తో మొదలైన ఆమె వ్యాపారం అదే నగరంలో ఎనిమిది బ్రాంచ్‌లకు చేరింది. ప్రస్తుతం ఈమె వైన్, స్పిరిట్ విక్రయాలకు ప్రతినిధిగా మారింది. కాలక్రమంలో ఆమె స్థాపించిన వైన్ టేస్టింగ్ రూమ్ తరువాత వైన్ బార్ అండ్ బాటిల్ షాప్‌గా రూపుదిద్దుకున్నాయి. అతి తక్కువ సమయంలో ఈమె బాగా ఎదగటానికి కారణం ఈ రంగంపై ఆమెకున్న అభిరుచే.
☛ IAS Varun Baranwal : 15 ఏళ్లకే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్లకే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ సక్సెస్ స్టోరీ
ప్రారంభంలో ఇలాంటి రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావంటూ ఎంతో మంది ఆమెను విమర్శించారు. కానీ ఎవరి మాటను లెక్క చేయని జోయా వోరా షా చివరికి అనుకున్న విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణం ఆమె భర్త అందించిన సహకారమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె బిజినెస్ కోట్లలో టర్నోవర్ పొందుతోంది. దీన్ని బట్టి చూస్తే మహిళ అనుకోవాలే కానీ ఆమె విజయం సాధించని రంగం అంటూ ఏది ఉండదని స్పష్టంగా తెలుస్తోంది.