IAS Success Story: వరుసగా మూడు సార్లు ఫెయిల్.. తర్వాత ఐఆర్ఎస్.. దాని తర్వాత ఐఎఫ్ఎస్.. ఆ తర్వాత ఐఏఎస్ సాధించిన ఐఐటీ కుర్రాడు సూర్యభాన్ సక్సెస్ స్టోరీ
అదే ఏడాది ఐఏఓఎఫ్ పరీక్ష రాశాడు. అందులోనూ సెలెక్ట్ అయ్యాడు. ఒకే ఏడాది రెండు అత్యున్నత ఉద్యోగాలు సాధించిన్పటికీ అతడిలో తెలియని అసంత`ప్తి. తన లక్ష్యమైన ఐఏఎస్ సాధించాలని పట్టుదలతో మరింత సమయం కేటాయించి కష్టపడ్డారు. ఐదో ప్రయత్నంలో తన కల సాకారం చేసుకుని, ఐఏఎస్ సాధించాడు. అతనే సూర్యభాన్ యాదవ్... తన ఐఏఎస్ లక్ష్యాన్ని ఎలా సాధించాడో ఇక్కడ తెలుసుకుందాం.
15 ఏళ్లకే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్లకే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ సక్సెస్ స్టోరీ
సూర్యభాన్ యాదవ్‌ది మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లా పరిధిలోని నల్లసోపరా పట్టణం. సూర్య చిన్ననాటి నుంచి చదువులో ముందుండే వాడు. ఆయన తల్లిదండ్రులు కూడా విద్యావంతులే. దీంతో చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేవాడు. ఇంటర్ వరకు స్థానికంగా చదువుకున్న సూర్య.. ఐఐటీలో మంచి ర్యాంకు రావడంతో ఐఐటీ భువనేశ్వర్‌లో సీటు వచ్చింది.
పది, ఇంటర్‌లో ఫెయిలయ్యా... ఈ అపజయాలే నన్ను 22 ఏళ్లకే ఐఏఎస్‌ను చేశాయ్... అంజు శర్మ సక్సెస్ స్టోరీ
ఇంజినీరింగ్ చదివే సమయంలో సూర్యకి యూపీఎస్సీ పరీక్షల మీద అవగాహనే ఉండేది కాదు. అతని స్నేహితులు పరీక్షలకు ప్రిపేరవుతున్నారని తెలుసుకుని, తాను యూపీఎస్సీ సీఎస్ఈ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. 2015 వరకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా అవగాహన లేదు అతనికి. స్నేహితుల సాయంతో పరీక్ష సిలబస్, ప్రిపరేషన్ విధానాన్ని తెలుసుకున్నాడు.
UPSC Ranker Taskeen Khan: మిస్ ఇండియా కావాలనుకున్నా... చివరికి సివిల్స్ ర్యాంకు సాధించా.. నా సక్సెస్ జర్నీ ఇదే...
బీటెక్ పూర్తయ్యాక తన పూర్తి సమయాన్ని యూపీఎస్సీకి కేటాయించాడు. ఇందుకోసం కోచింగ్ కూడా తీసుకున్నాడు. మొదట్లో తనకు ఏదీ అర్థం అయ్యేది కాదని, ఒకటికి రెండు మూడు సార్లు చదివి ఒక్కో అంశాన్ని అర్థం చేసుకునేవాడినని సూర్య చెప్పాడు.
కోచింగ్ అయ్యాక 2017లో తొలిసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యాడు. ఫస్ట్ అటెంప్ట్‌లో కనీసం క్వాలిఫై కూడా కాలేదు. రెండు, మూడు ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనివ్వలేదు. చివిరికి 2020లో తన నాలుగో ప్రయత్నంలో ఆల్ ఇండియా 488 ర్యాంకు సాధించాడు. కానీ, అతనికి వచ్చిన ర్యాంకుకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) వచ్చింది. అదే ఏడాది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ (ఐఎఫ్ఎస్)కి కూడా హాజరై ఏఐఆర్ 57 సాధించాడు సూర్యభాన్.
UPSC topper Ishita Kishore’s marks: అదరగొట్టిన యూపీఎస్సీ టాపర్ ఇషితా కిషోర్... ఆమెకు వచ్చిన మార్కులు ఎన్నంటే...
ఇప్పుడు ఆయనకు రెండు ఆప్షన్లు ఉండటంతో ఐఎఫ్ఎస్ కంటే ఐఆర్ఎస్‌ను ఎంచుకున్నాడు. కానీ, ఐఏఎస్ కావాలనే కోరిక అతడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఐఏఎస్ కోసం తన ప్రిపరేషన్ కొనసాగించారు. ఐఆర్ఎస్ శిక్షణ తీసుకుంటూనే ఐదో ప్రయత్నానికి హాజరై తన లక్ష్యాన్ని అందుకున్నాడు. 2022లో విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా 27 ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యాడు. తుది ఫలితాల్లో 1027 మార్కులు వచ్చాయి.
Civils Toppers: రెండేళ్లపాటు మంచంలోనే... పట్టుదలతో చదివి సివిల్స్‌లో మెరిసింది... ఈమె కథ వింటే కన్నీళ్లే
సూర్యభాన్ గురించి మరికొన్ని విషయాలు....
- యూపీఎస్సీ సీఎస్ఈ 2022లో ఏఐఆర్ 27 సాధించాడు.
- ఇది అతని ఐదవ ప్రయత్నం
- ఆప్షనల్ సబ్జెక్టుగా గణితాన్ని ఎంచుకున్నాడు.
- ఐఆర్ఎస్ గా ఎంపికైన 2020లోనే ఐఎఫ్ఎస్ పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించారు.
- జనరల్ స్టడీస్‌లో తగినంత శ్రద్ధ పెట్టడం లేదని గ్రహించిన ఆయన జీఎస్ పేపర్లపై ఎక్కువ దృష్టి సారించి, ఐదో ప్రయత్నంలో 1027 మార్కులు సాధించాడు.