IAS Anju Sharma Success Story: పది, ఇంటర్‌లో ఫెయిలయ్యా... ఈ అపజయాలే నన్ను 22 ఏళ్లకే ఐఏఎస్‌ను చేశాయ్... అంజు శర్మ సక్సెస్ స్టోరీ
చలాకీగా తిరుగుతూ, నలుగురిలో కలివిడిగా తిరిగే స్వభావం అంజుది. ఆమె బంధువులు, చుట్టుపక్కల వారు ఏమాత్రం ఆశ్చరపడలేదు ఆమె ఫెయిలైన విషయం విని. తర్వాత ఇంటర్‌లో జాయినైంది. సైన్స్ అంటే భయంతో ఇంటర్లో ఆర్ట్స్ గ్రూపును ఎంపిక చేసుకుంది. అయినా అక్కడ కూడా ఫెయిలే. ఎకనామిక్స్‌లో ఫెయిలైంది. వరుసగా రెండు సార్లు ఫెయిల్‌కావడంతో తీవ్రంగా బాధపడుతూనే తన ఫెయిల్‌కు కారణాలను అన్వేషించింది అంజుశర్మ.
UPSC Ranker Taskeen Khan: మిస్ ఇండియా కావాలనుకున్నా... చివరికి సివిల్స్ ర్యాంకు సాధించా.. నా సక్సెస్ జర్నీ ఇదే...
రెండు అపజయాలు తీవ్రంగా బాధపెట్టడంతో ఆమె తన ప్రతిభకు పదును పెట్టారు. డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి ఎదిగింది అంజు. డిగ్రీ తరువాత ఎంబీఏ పూర్తి చేసింది. ఎంబీఏ చదువుతున్న సమయంలోనే ఆమె చూపు సివిల్స్ వైపు పడింది. కానీ, పది.. ఇంటర్‌లోనే ఫెయిలైన భయం ఉండడంతో అత్యంత కష్టమైన సివిల్స్ పాసవుతానా అని ఆలోచించింది. పట్టుదలతో చదివితో సాధించలేనిదంటూ ఉండదని బలంగా నమ్మింది.
UPSC topper Ishita Kishore’s marks: అదరగొట్టిన యూపీఎస్సీ టాపర్ ఇషితా కిషోర్... ఆమెకు వచ్చిన మార్కులు ఎన్నంటే...
అలా ఎంబీఏ చదువుతూనే సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించింది. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన పూర్తి సమయాన్ని సివిల్స్‌కు కేటాయించింది. ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టకుండా చదవడం ప్రారంభించింది. రోజుకు అలా గంటల పాటు చదువుకే అంకితమయ్యేది. ఏడాది పాటు తాను ఏం చేస్తోందో కూడా ఎవరికీ తెలియదు.
Civils Toppers: రెండేళ్లపాటు మంచంలోనే... పట్టుదలతో చదివి సివిల్స్‌లో మెరిసింది... ఈమె కథ వింటే కన్నీళ్లే
కట్ చేస్తే 1990లో విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో అంజుశర్మ సత్తా చాటింది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ క్రాక్ చేసి శభాష్ అనిపించుకుంది. సివిల్స్‌లో విజయం సాధించిన విషయాన్ని ఆమె బంధువులు, చుట్టుపక్కల వారు ఎవరూ కూడా నమ్మలేదు. ఆడుతూ, పాడుతూ తిరిగే అమ్మాయి ర్యాంకు ఎలా సాధించిందా అని వారి సందేహం.
UPSC Civils Toppers: 23 ఏళ్లకే ఐఏఎస్... ఎలాంటి కోచింగ్ లేకుండానే కశ్మీర్ నుంచి సత్తాచాటిన యువతి... నా సక్సెస్ సీక్రెట్ ఇదే...
కాబట్టి, పరీక్షల్లో ఫెయిల్ అవడం సహజమే. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి అని చెప్తుంది అంజు శర్మ. అంజు జులై 15, 1969లో రాజస్థాన్‌లో జన్మించింది. తన విద్యాభ్యాసం అంతా స్థానికంగానే సాగింది. సివిల్స్‌లో ర్యాంకు సాధించిన తర్వాత శిక్షణ అనంతరం ఆమె ఫస్ట్ పోస్టింగ్ అసిస్టెంట్ కలెక్టర్. 1991లో రాజ్ కోట్ లో అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో కెరీర్ ప్రారంభించారు. తర్వాత గాంధీనగర్ జిల్లా కలెక్టర్ సహా పలు ప్రభుత్వ పదవులు చేపట్టారు.
IAS Vijay Wardhan Success Story: జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు... వరుసగా 35 సార్లు ఫెయిల్... చివరికి ఐఏఎస్ సాధించానిలా
22 ఏళ్ల వయసులోనే అంజు సివిల్ సర్వీసెస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించింది. ఆ ఏడాది ఐఏఎస్ టాప్ స్కోరర్లలో ఒకరిగా నిలిచారు. అంజు శర్మ ప్రస్తుతం గాంధీనగర్ లోని ప్రభుత్వ విద్యాశాఖ (ఉన్నత, సాంకేతిక విద్య) సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
☛➤☛ ఒక వైపు తండ్రి మరణం.. మరో వైపు కుటుంబంపై నిందలు.. ఈ కసితోనే చదివి డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా..
"మీకు కావలసిందల్లా బలమైన సంకల్పం, ఏకాగ్రత. ఫలితాల గురించి ఆందోళన చెందకుండా చిత్తశుద్ధితో పనులు చేయండి. పరీక్షలను కేవలం పరీక్షలాగా మాత్రమే చూడండి. జీవితంలో లెక్కకి మించి అవకాశాలు వస్తాయి. జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఓర్పు కూడా ఉండాలి" అని అంజు శర్మ చెప్తారు.