Skip to main content

UPSC topper Ishita Kishore’s marks: అద‌ర‌గొట్టిన యూపీఎస్సీ టాప‌ర్ ఇషితా కిషోర్‌... ఆమెకు వ‌చ్చిన‌ మార్కులు ఎన్నంటే...

యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ విడుద‌ల చేసిన సివిల్స్‌-2022 ఫ‌లితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన ఇషితా కిషోర్ సాధించిన మార్కులు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అయ్యాయి. థ‌ర్డ్ అటెంప్ట్‌లో ఆమె ఫ‌స్ట్ ర్యాంకు సాధించింది. కొద్ది రోజుల కింద‌ట ర్యాంకులు ప్ర‌క‌టించిన యూపీఎస్సీ... తాజాగా ర్యాంక‌ర్ల మార్కుల‌ను విడుద‌ల చేసింది. ఇషితా కిషోర్‌కు వ‌చ్చిన మార్కులు ఎన్నో తెలుసుకుందామా...!
UPSC topper Ishita Kishore’s marks
UPSC topper Ishita Kishore’s marks

సివిల్స్‌ పరీక్షలో ఇషితా కిషోర్ 1094 మార్కులు సాధించింది. ఆమె రాత పరీక్షలో 901, పర్సనాలిటీ టెస్ట్‌లో 193 మార్కులు సాధించింది. అత్య‌ధిక స్కోరు సాధించేందుకు వీలుగా అభ్య‌ర్థులు ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్ట్‌గా త‌మ‌కు ప‌ట్టున్న దాన్ని ఎంచుకుంటారు. ఈ సారి ఇషిత్ త‌న ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్ట్‌గా పొలిటికల్‌ సైన్స్‌& ఇంటర్నేషనల్‌ రిలేషన్స్ ను ఎంచుకుంది. ఈ స‌బ్జెక్ట్‌లో ఆమె అత్య‌ధిక మార్కులు సాధించ‌డం విశేషం.

Civils Toppers: రెండేళ్ల‌పాటు మంచంలోనే... ప‌ట్టుద‌ల‌తో చ‌దివి సివిల్స్‌లో మెరిసింది... ఈమె కథ వింటే క‌న్నీళ్లే

Ishita Kishore

ఇషితా సాధించిన మార్కులు....

ఎస్సే (పేపర్-I): 137

జనరల్ స్టడీస్-I (పేపర్-II): 121

జనరల్ స్టడీస్-II (పేపర్-III): 130

జనరల్ స్టడీస్-III (పేపర్-IV): 088

జనరల్ స్టడీస్-IV (పేపర్-V): 112

చ‌ద‌వండి: 23 ఏళ్ల‌కే ఐఏఎస్‌... ఎలాంటి కోచింగ్ లేకుండానే క‌శ్మీర్ నుంచి స‌త్తాచాటిన యువ‌తి

Ishita Kishore

ఆప్షనల్-I (పొలిటికల్‌ సైన్స్‌& ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌) (పేపర్-VI): 147

ఆప్షనల్‌-II (పొలిటికల్‌ సైన్స్‌& ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌) (పేపర్-VII): 166

26 ఏళ్ల ఈ యువ‌తి త‌న డిగ్రీని ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC)లో పూర్తి చేసింది. గ్రాడ్యుయేష‌న్ కంప్లీట్ అయిన త‌ర్వాత‌ మల్టినేషనల్‌ కంపెనీ EYలో పని చేసింది. త‌ర్వాత ఆ ఉద్యోగానికి స్వ‌స్తి చెప్పి సివిల్స్ వైపు అడుగులు వేసింది. మొద‌టి రెండు ప్ర‌య‌త్నాల్లో ఇంట‌ర్వ్యూ వ‌ర‌కు వెళ్లిన ఇషిత ర్యాంకు సాధించ‌లేక‌పోయింది. మూడో ప్ర‌య‌త్నంలో ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంకు సాధించి స‌త్తా చాటింది. 

చ‌ద‌వండి: ఆరేళ్ల క‌ష్టానికి ఫ‌లితం.. ఒకేసారి మూడు కేంద్ర కొలువులు... నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే...

Ishita Kishore

ప్రిపరేషన్ కోసం ఇషిత తన సొంత నోట్స్, స్టడీ మెటీరియల్‌పై ఆధారపడింది. మూడో అటెమ్ట్ కోసం ఆన్‌లైన్ తరగతులకు హాజరైంది. ప్రతి రోజూ ప్రిపరేషన్‌కి 8-9 గంటలు కేటాయించింది. UPSC పరీక్షను క్లియర్ చేయడానికి సబ్జెక్ట్స్‌ కోర్‌ని అర్థం చేసుకోవడం చాలా కీలకమని ఆమె చెబుతోంది. చదువులతో పాటు ఆటల్లో కూడా ఇషిత్ టాప‌రే. 

Ishita Kishore

చ‌ద‌వండి: జీవితంలో ఓట‌మిని ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దు... వ‌రుస‌గా 35 సార్లు ఫెయిల్‌... చివ‌రికి ఐఏఎస్ సాధించానిలా

Ishita Kishore

ఈ సంవత్సరం యూపీఎస్సీ ఫలితాలలో మొదటి మూడు స్థానాలను బాలికలు కైవసం చేసుకున్నారు. ఇషిత ఫస్ట్ ర్యాంక్‌ సొంతం చేసుకోగా, గరిమా సోని రెండు, ఉమా హారతి ఎన్ మూడు స్థానాల్లో నిలిచారు. తన అత్యుత్తమ ప్రదర్శనతో ఇషితా కిషోర్ ఔత్సాహిక సివిల్ సర్వెంట్లకు రోల్ మోడల్‌గా నిలిచింది.

చ‌ద‌వండి: IAS Divyanshu Choudhary: బ్యాంకు జాబ్ వ‌దిలేసి.. ఐఏఎస్ సాధించిన‌ కుర్రాడు

Published date : 03 Jun 2023 03:14PM

Photo Stories