Civils Toppers: రెండేళ్లపాటు మంచంలోనే... పట్టుదలతో చదివి సివిల్స్‌లో మెరిసింది... ఈమె కథ వింటే కన్నీళ్లే
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా లెవల్‌లో సత్తాచాటి లక్షల మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆమె కేరళకు చెందిన షెరిన్ షహానా. ఆమె కథ వింటే కళ్లు చెమర్చకుండా ఉండలేరు. కన్నీళ్లను దిగమింగుకుంటూ, కష్టాలను ఎదురీది ఆమె సాధించిన విజయగాథ తెలుసుకుందామా..!
చదవండి: 23 ఏళ్లకే ఐఏఎస్... ఎలాంటి కోచింగ్ లేకుండానే కశ్మీర్ నుంచి సత్తాచాటిన యువతి
కేరళ వయనాడ్‌కు చెందిన షెరిన్ షహానా కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఐదేళ్ల కిందట అంటే 2017 వరకు అందరిలాగానే అన్ని పనులు చేసుకునే ఆమె.. ఆ సమయంలో ఇంటి టెర్రస్‌పై నుంచి ప్రమాదవశాత్తూ కింద పడింది. దీంతో రెండుచోట్ల పక్కటెముకలు విరగడంతో పాటు వెన్నెముకకు గాయాలయ్యాయి.
చదవండి: ఆరేళ్ల కష్టానికి ఫలితం.. ఒకేసారి మూడు కేంద్ర కొలువులు... నా సక్సెస్ సీక్రెట్ ఇదే...
రెండు చేతులు, శరీర కింది భాగం పక్షవాతంతో చచ్చుబడిపోయింది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పాజిటివ్‌గా ఆలోచించింది షెరిన్. శారీరక లోపాల్ని అధిగమించి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ఇదే సివిల్స్ సాధించాలన్న పట్టుదల తనలో పెంచింది.
చదవండి: జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు... వరుసగా 35 సార్లు ఫెయిల్... చివరికి ఐఏఎస్ సాధించానిలా
ప్రమాదం తర్వాత తన జీవితాన్ని పునఃప్రారంభించాలని షెరిన్ ఫిక్సయింది. అనుకోని ప్రమాదంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. బంధువులు, చుట్టుపక్కల వారు అందరు జాలితో చూసేవాళ్లే. ఆడుతూ పాడుతూ జాలిగా గడిపిన షెరీన్.. ఒక్కసారిగా కుంగుపాటుకు గురైంది. కానీ, అదే సమయంలో తన శారీరక లోపాన్ని అధిగమించాలనుకుంది.
చదవండి: IAS Divyanshu Choudhary: బ్యాంకు జాబ్ వదిలేసి.. ఐఏఎస్ సాధించిన కుర్రాడు
మంచం మీద నుంచి కదిలే పరిస్థితి లేదు. తన కనీస అవసరాలు తీర్చేందుకు కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితి. అటువంటి సమయంలో ఎవరైనా భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు కూడా సిద్ధపడరు. కానీ, షెరీన్ అలా కాదుగా... తనకు సాధ్యమయ్యేవి, సాధ్యం కానివి ఏంటో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంది. అలా ముందుకు సాగింది.
➤☛ ఐఏఎస్ కావాలనుకున్నాడు... ఇప్పుడు టీ అమ్ముతూ 150 కోట్లు సంపాదిస్తున్నాడు
ఇదే సమయంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేసింది. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండడంతో... పోటీ పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది. తన మనసు సహకరించిన శరీరం సహకరించేది కాదు. పరీక్ష రాసేందుకు చేతులు కూడా సహకరించని దీనస్థితిలో షెరీన్ ఉంది. కానీ, ఒకటే పట్టుదలపై పట్టువిడవకుండా చదవడం ప్రారంభించింది. ఓవైపు పిల్లలకు ట్యూషన్స్ చెబుతూ... సివిల్స్‌కీ సన్నద్ధమవ్వడం ప్రారంభించింది.
➤☛ మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
తన శారీరక లోపం కారణంగా పేజీలు కూడా తిప్పలేని పరిస్థితి. అయినా మరొకరి సహాయంతో పరీక్ష రాసింది. అలా యూపీఎస్సీ 2022 ఫలితాల్లో 913 ర్యాంకు సాధించింది. ఈ ఆనంద సమయంలోనూ ఆమె బాధలోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఫలితాలు వెలువడే సమయానికి మళ్లీ రోడ్డు ప్రమాదంలో గాయపడింది షెరిన్. ఆస్పత్రి బెడ్ మీది నుంచే ఆమె తన ఫలితాలను చూసుకుంది. షెరిన్ మనకందరికి ఆదర్శప్రాయమే కదా. ఆమెలా కష్టపడితే ఎలాంటి విజయమైనా దాసోహం అనాల్సిందే.