Skip to main content

1.6 Crore Package: 1.6 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన ఎన్ఐటీ అమ్మాయి

ప్ర‌స్తుతం ఎక్క‌డా చూసినా ఉద్యోగాల తొల‌గింపుల వార్త‌లే చూస్తున్నాం. ఖ‌ర్చులు త‌గ్గించుకుంటున్నాం.. అనే సాకుతో దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఉద్యోగుల‌ను ఉన్న‌ఫ‌ళంగా ఇంటికి సాగ‌నంపుతున్నాయి. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌... త‌దిత‌ర సంస్థ‌ల‌న్నీ వేల సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తూ పోతున్నాయి.
Aditi Tiwari
Aditi Tiwari

ఇదే స‌మ‌యంలో ఆయా కంపెనీలు భారీ వేత‌నాల‌తో ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నాయి. టాలెంట్ ఎక్క‌డ ఉన్నా గుర్తించి భారీ ప్యాకేజీ ఆఫ‌ర్ చేసి ఎగరేసుకుపోతున్నాయి. ఇటీవ‌లే మైక్రోసాఫ్ట్ రెండు కోట్ల వేత‌నంతో ఓ విద్యార్థిని ఎంపిక చేసుకోగా, తాజాగా ఫేస్‌బుక్‌ రూ.1.6 కోట్ల వేత‌నం ఆఫ‌ర్ చేసి ఓ విద్యార్థినిని ఎంపిక చేసింది. ఆ వివ‌రాలేంటో ఇక్క‌డ తెలుసుకుందాం.!

చ‌ద‌వండి: రెండు కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన హైద‌రాబాదీ అమ్మాయి 

aditi tiwari

అదితి తివారీది జంషెడ్‌పూర్‌. ఆమె తండ్రి సంజయ్‌ తివారీ టాటా స్టీల్‌ సంస్థలో ఉద్యోగి. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తల్లిదండ్రులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తానూ తన పేరెంట్స్‌లాగే కెరీర్‌లో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరుకుందామె. ఈ ఆలోచనతోనే చదువులో మేటిగా నిలుస్తూ వచ్చింది. 

చ‌ద‌వండి: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి

nit patna

ప్రస్తుతం పాట్నా నిట్‌లో ఈసీఈ (ECE) చివరి సంవత్సరం చదువుతోన్న అదితి.. ఇటీవలే ఫేస్‌బుక్‌ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో పాల్గొంది. తన ప్రతిభతో ఆ సంస్థలో ఫ్రంట్‌ ఎండ్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించడమే కాదు.. రూ. 1.6 కోట్ల ప్యాకేజీ సాధించింది. పాట్నా నిట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ప్యాకేజీ. 

☛ 88 Lakh salary package: అద‌ర‌గొట్టిన వ‌రంగ‌ల్ నిట్ విద్యార్థి.... 88 ల‌క్ష‌ల ప్యాకేజీతో రికార్డు

nit patna

☛ 2 crore job offer from Uber: సాధార‌ణ రైతు బిడ్డ‌... రూ.2 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టాడు

గతంలో నిర్వ‌హించిన క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికైన విద్యార్థులు అత్యధికంగా రూ. 50-60 లక్షల ప్యాకేజీని అందుకున్నారు. రికార్డు స్థాయిలో ప్యాకేజీతో ఆదితి ఎంపిక‌వ‌డంతో ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Published date : 12 May 2023 04:12PM

Photo Stories