బ్రేకింగ్ న్యూస్:రాజీవ్ యువ వికాస పథకం.. సబ్సిడీని రెండు దశల్లో విడుదల

రాజీవ్ యువ వికాసం కింద ప్రభుత్వం అందించే సబ్సిడీని రెండు దశల్లో విడుదల చేయనున్నట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పథకం మంజూరయ్యాక కొంత మొత్తం, స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నాక మిగిలిన మొత్తాన్ని రిలీజ్ చేస్తామన్నారు. లబ్ధిదారులకు 3-15 రోజులపాటు ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందేందుకు రూ.4 లక్షల వరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఇందులో 80% వరకు రుణ రాయితీ కూడా ఉంది.ఈ స్కీమ్ కింద రాయితీతో రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకూ సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజీవ్ యువ వికాసం పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం కుటుంబంలోని ఒకరికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తోంది. https://tgobmms.cgg.gov.in/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2వ తేదీ లబ్ధిదారులను ఎంపిక చేసి వారి జాబితాను విడుదల చేస్తారు.
రుణాలు మంజూరు వీరికే..
ఎడ్ల బండ్లు, ఆయిల్ ఇంజిన్ పంప్ సెట్, ఎయిర్ కంప్రెసర్, పత్తి సేకరణ యంత్రం, వేరుశనగ మిషన్, వర్మీ కంపోస్ట్, ఆయిల్ ఫామ్ వంటి ఉపాధి వ్యవసాయ అంశాలకు సంబంధించిన అంశాల్లో ఈ రుణాలు అందిస్తారు. పశుపోషణకు సంబంధించి గేదెలు, ఆవుల పెంపకం, డైరీ ఫార్మ్, కోడిగుడ్ల వ్యాపారం, చేపలు మేకల పెంపకం, పాల వ్యాపారం, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం విభాగాల్లో రుణాలు మంజూరు చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన కులాల నిరుద్యోగులకు సొంత వ్యాపారం చేసుకునే ఈ అవకాశం కల్పించారు.
ఆటోమొబైల్ షాప్ నిర్వహణ, స్టీల్ వ్యాపారం, ఎయిర్ కూలర్, గాజుల దుకాణంతోపాటు హెయిర్ కటింగ్ షాపు, బ్యూటీ పార్లర్, బట్టల తయారీ, జనరల్ స్టోర్, ఇటుకల తయారీ, డిష్, టీవీ, వడ్రంగి సీసీ కెమెరాలు రిపేర్ షాప్, ఇది కాకుండా గోల్డ్ షాప్, జనరేటర్ షాప్ గిఫ్ట్ ఆర్టికల్ షాప్, లాండ్రీ షాపు డ్రై క్లీనింగ్, లేడీస్ కార్నర్, మినీ సూపర్ బజార్, మటన్, చికెన్ షాప్, పేపర్ బ్యాగులు తయారీ వరకు... పై వ్యాపారాలు చేసుకునేందుకు ఈ రుణాలను అందిస్తోంది. ఎంపికైన నిరుద్యోగులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన నిధులు మంజూరు చేస్తారు.
ఇదీ చదవండి:నేడు జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 ర్యాంకులు విడుదల చేయనున్న ఎన్‌టీఏ
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Rajiv Yuva Vikas Scheme
- Rajiv Yuva Vikas subsidy
- Youth empowerment scheme India
- Government schemes for youth
- Two-phase subsidy scheme
- Skill development subsidy
- Self-employment scheme for youth
- Rajiv Yuva scheme benefits
- Rajiv Yuva Vikas application
- Startup subsidy scheme for youth
- Breaking news
- Education News
- Telugu News
- TelanganaJobsScheme
- SelfEmploymentScheme