Actress to DSP Post Achiever Success Story : సినీ రంగంలో గొప్ప ప్రశంసలు.. ఎంపీపీఎస్సీతో డీఎస్పీగా.. కానీ ఇంత కష్టాన్ని మాత్రం..
సాక్షి ఎడ్యుకేషన్: కొందరికి ఒక రంగంలోకి వెళితే, కష్టమైనా, సులభమైనా అదే రంగంలో ఉంటారు. కొందరు కొంచం కొత్తగా ప్రయత్నంచేందుకు దారి మళ్లుతారు. కాని, ఈ యువతి కథ వేరు. సినీ రంగంలోకి ప్రవేశిస్తే చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి అక్కడే స్థిరపడతారు. కాని, కొందరు వారికి నచ్చిన రంగంలోకి నడుస్తారు.
ఐఏఎస్ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహ్రున్నీసా పర్వేజ్‌ల కూతురు బాలీవుడ్ నటి ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఉద్యోగిని సిమ్లా ప్రసాద్. గతంలో బాలీవుడ్‌కు వెళ్ళి పలు సినిమాలు చేసింది. అక్కడ ఆమె నటించిన “అలిఫ్”, “నక్కష్” సినిమాల్లో అలిఫ్‌లో ఆమె పోషించిన షమ్మీ పాత్ర ఆమెకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అయితే, తన తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడంతో తన తండ్రిని స్పూర్తిగా తీసుకొని తను కూడా అదే దారి నడవాలని నిర్ణయించుకుంది.
నటనతోనే మాస్టర్స్ డిగ్రీ..
భూపాల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదువు పూర్తి చేసుకొని, డిగ్రీలో కామర్స్ పూర్తి చేసింది. ఈ సమయంలోనే తన తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ అయినా తన ఆశ సినీ రంగంలో ఉన్నప్పటికీ తన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తను అక్కడ చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రశంసలు పొందే పాత్రల్లో పోషించింది. ఇలా, సినీ రంగంలో ఉంటూనే తన మాస్టర్స్ డిగ్రీని కూడా పూర్తి చేసుకుంది.
ఎంపీపీఎస్సీ లక్ష్యంగా..
ఏ రంగంలో నుంచి అయినా కొందరు బయటకి వచ్చి వేరే ఉద్యోగం లేదా వారి లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తారు. కాని, సినీ రంగం లాంటి రంగుల ప్రపంచం నుంచి చాలామంది బయటకు రావాలనుకోరు. ఎంతటి కష్టాలైనా ఎదుర్కొని అక్కడే స్థిరపడిపోతారు. అటువంటి ఒక రంగంలోంచి బయటకు వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంది సిమ్లా ప్రసాద్. ఇలా, తన మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసుకున్న వెంటనే ఎంపీపీఎస్సీ అంటే.. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాయాలని నిర్ణయించుకుంది.
యూపీఎస్సీలో ఉత్తీర్ణత..
ఇదే దశగా అడుగులు వేయడం ప్రారంభించగా ఈ రంగం చాలా కష్టం అని తెలిసినప్పటికీ కష్టాలన్నింటినీ ఇష్టంగా భావించి ముందుకు సాగింది. ఈ రంగాన్ని ఎంచుకున్న యువతి ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. తన సొంతంగా ప్రపేర్ అయ్యి, తన తండ్రి సహకారం కూడా ఇందులో భాగమైంది.
ఇలా, ప్రభుత్వ ఉద్యోగం వైపు సాగిన సిమ్లా ప్రసాద్ ఎంపీపీఎస్సీ పరీక్షను రాసి ఉత్తీర్ణత సాధించింది. దీంతో తను ఏకంగా డీఎస్పీ పోస్టుకు ఎంపికైంది. ఈ విజయం తన తొలి ప్రయత్నంలోనే దక్కడం విశేషం.
మొత్తానికి డీఎస్పీగా విధులు
ప్రస్తుతం, ఆమె మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఎస్పీగా తన విధులు నిర్వహిస్తున్నారు. తన చదువును పూర్తి చేసుకొని సినీ రంగంలోకి ప్రవేశించి అక్కడ తన నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు. తన పాత్రలతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు, ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి మరోసారి తన అందరి ప్రశంసలు అందేలా తొలి ప్రయత్నంలోనే విజయం పొందారు.
Tags
- ips officer success story
- inspiring stories of ips officers
- upsc rankers
- UPSC Rankers success story
- bollywood actress ips officer simala prasad
- actress to ips officer success journey
- UPSC top ranker simala prasad
- simala prasad success story
- DSP Simala Prasad success and inspiring story
- IPS Simala prasad
- bollywood actress to ips officer
- simala prasad ips news in telugu
- Competitive Exams Success Stories
- simala prasad ips movies
- popular movies of ips officer simala prasad
- Competitive Exams
- success stories of women ips officers
- success stories in telugu
- latest success stories of ips officers in telugu
- success and motivational stories of women ips officers in telugu
- simala prasad ips news
- Education News
- Sakshi Education News
- sakshieducation success stories