Skip to main content

TV Somanathan: కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సోమనాథన్

సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ ఆగ‌స్టు 30వ తేదీ కేబినెట్ కొత్త సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.
Senior IAS Officer TV Somanathan Takes Over As Cabinet Secretary

ఐదేళ్ల నుంచి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా ప‌నిచేస్తున్న‌ రాజీవ్ గౌబ స్థానంలో ఈయ‌న‌ బాధ్యతలు స్వీక‌రించి, రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 

కాగా.. జార్ఖండ్ కేడర్‌కు చెందిన 198 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్ గౌబా 2019 నుంచి భారత కేబినెట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.  అతని పదవీకాలాన్ని సంవత్సర కాలం వ్యవధితో ఇప్పటి వరకు 4 సార్లు పొడిగించారు. ఈయ‌న‌ 1987 బ్యాచ్‌కు చెందిన తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 

సోమనాథన్‌ కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. 2019 నుంచి 2021 వరకు కేంద్ర ఆర్థికశాఖ ఫైనాన్స్ ఎక్స్‌పెండిచర్ విభాగం కార్యదర్శిగా సేవలు చేశారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.  

Satish Kumar: రైల్వే బోర్డు చైర్మన్‌గా నియమితులైన తొలి ఎస్సీ అధికారి ఈయనే..

సోమనాథన్ ప్రధానమంత్రి కార్యాలయంలో(పీఎంఓ) 2015 నుంచి 2017 మధ్యకాలంలో జాయింట్ సెక్రెటరీగానూ పనిచేశారు. వ్య‌య కార్య‌ద‌ర్శిగా 2019లో నియ‌మితులై.. 2021 ఏప్రిల్‌లో ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి అయ్యారు.  

అంతకుముందు కొన్నిరోజులు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ జాయింట్ సెక్రెటరీగా, వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకు కార్పొరేట్ వ్యవహారాల విభాగం డైరెక్టర్‌గా సేవలందించారు. తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఈయ‌న‌ 2007 నుంచి 2010 వరకు చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా వ్యవహరించారు. అలాగే.. తమిళనాడు సీఎం కార్యాలయం జాయింట్ సెక్రెటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

SBI Chairman: ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సీఎస్‌ సెట్టీ

Published date : 02 Sep 2024 08:51AM

Photo Stories