Inspirational Story of UPSC Ranker: కూరగాయల వ్యాపారి కూతురు యూపీఎస్సీలో ర్యాంకర్‌గా.. ఐదు ప్రయత్నాలు విఫలమే.. కానీ!
సాక్షి ఎడ్యుకేషన్: స్వాతి మోహన్ రాథోడ్.. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో కూరగాయల వ్యాపారి కూతురు. ఒక సాధారణమైన మధ్యతరగతి యువతి. ఏమీ లేకున్న అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు ఏమైనా సాధించగలం అనే భావనతో జీవించే అమ్మాయి. అటువంటి, ఈ యువతి గతేడాది నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. తన చదువు కోసం ఈ యువతి తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు. తమ జీవితంలో ఉన్న ఎత్తొంపులను అన్ని దాటుకొని, పట్టుదలతో నిలిచింది. మరి ఈ యువతి సాధించిన ఈ విజయానికి ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందామా..
చదువు..
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో నివాసం ఉంటున్న స్వాతి మోహన్ రాథోడ్ నలుగురు అక్కాచెల్లెల్లో ఒకరు. ప్రభుత్వ పాఠశాలలో తన పదో తరగతి చదువును పూర్తి చేసుకున్న స్వాతి, జియోగ్రఫీలో డిగ్రీ ఇంక మాస్టర్స్‌ను కోలాపూర్‌లోని వాల్చంద్ కళాశాలలో పూర్తి చేసింది.
యూపీఎస్సీ ఆలోచన ఇలా..
తన కళాశాలలో చదువు సాగుతుండగానే తనకు ఈ యూపీఎస్సీ పరీక్ష రాయాలనే ఆలోచన తన మనసులో గట్టిగా నిలిచింది. ఎన్ని కష్టాలు ఉన్న సాధించాలనే తపన తన వెంటే ఉండేది.
ప్రయత్నాలు విఫలం అయినా..
అనుకున్నంత వేగంగా ఏ పనులు జరగవు.. అలాగే, స్వాతి యూపీఎస్సీ పరీక్ష రాయాలనుకుంది కాని, తాను చేసిన ఐదు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయినప్పటికీ, ఏమాత్రం పట్టుదల వీడకుండా తిరిగి ఆరోసారి తన ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇన్ని ప్రయత్నాల్లో విఫలం అవుతున్నప్పటికీ, తనలో మరింత పట్టుదల పెరిగిందే కాని తగ్గలేదు. ఒక రుచికరమైన ర్యాంకును ఆశ్వాదించేందుకు ఐదు ప్రయత్నాల విఫలాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తల్లిదండ్రుల కృషి..
ఆ రుచి స్వాతికి తన ఆరో ప్రయత్నంలో దక్కింది. తన చదువుకోసం ఎంతటి కష్టాన్నైన ఎదుర్కొనే తన తల్లిదండ్రుల ప్రోత్సాహం తనకి ఈ ప్రయాణంలో తన వెంటే ఉంది. తన చదువు కోసం అయ్యే ఖర్చులకు తన తల్లి బంగారాన్ని తాకట్టు పెట్టి మరి ప్రోత్సాహించింది. ఇవ్వన్ని ఎదురుకున్న స్వాతి ఎంతటి కష్టమైన దాటుకొని గెలవాలి. తన తల్లిదండ్రుల కష్టానికి ఫలితాన్ని ఇవ్వాలనుకుంది. చివరికి తన ప్రయత్నం, ఆశయం ఫలించి దేశంలోనే 492వ ర్యాంకును సాధించింది. తన ఈ ప్రయాణం ఎంతోమందికి స్పూర్తిదాయకం..
UPSC Topper: యూపీఎస్సీ టాపర్‌పై 'ఆనంద్ మహీంద్రా' ప్రశంసల జల్లు.. ఎమన్నారంటే..!
Tags
- UPSC Ranker
- civils ranker
- UPSC Ranker Swati Mohan Rathod
- inspiring story of upsc ranker
- success journey of swati mohan
- struggle for upsc exam
- success story of a women in upsc
- inspiring story of swati mohan rathod
- success journey
- rankers success journey
- inspiring and motivating stories for upsc candidates
- students talent
- Education News
- Sakshi Education News
- latest success stories
- latest stories of upsc rankers
- best motivational story for competitive exam candidates