Books for Inter Students : ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ.. వారం రోజుల్లో!
Sakshi Education

ఆటోనగర్: ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కార్యాలయ మేనేజరు ఏఎస్‌కే ఆంజనేయులు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు పంపిస్తున్నట్టు చెప్పారు. వారం రోజుల్లో వివిధ కాలేజీలకు పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుందన్నారు. కృష్ణాలో 25, ఎన్టీఆర్ జిల్లాలో 16 కళాశాలలకు పుస్తకాలు పంపిస్తున్నామని పేర్కొన్నారు.
Kuchipudi Admissions : కూచిపూడి నాట్యంలో ప్రవేశాలపై విద్యార్థుల్లో గందరగోళం..
Published date : 27 Jul 2024 05:19PM