Polycet Spot Admissions 2024 : ఈనెల 31న పాలిసెట్ 2024 స్పాట్ అడ్మిషన్లు.. ఈ పత్రాలు తప్పనిసరి..
మొగల్రాజపురం: పాలిసెట్–2024 కౌన్సెలింగ్‌లో భర్తీ చేయగా మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి ఈ నెల 31వ తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టనున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. విజయసారథి ఓ ప్రకటనలో తెలిపారు. డిప్లొమా ఇన్ ఆటోమోబైల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో సీట్లు ఖాళీలున్నాయని వివరించారు.
Free Training: బ్యూటీకేర్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ.. అర్హులు వీరే..
పాలిసెట్–2024 పరీక్షకు హాజరైన వారితో పాటుగా, హాజరుకాని వారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లల్లో పాల్గొని సీటు పొందవచ్చని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు పదో తరగతి మార్కుల జాబితా, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ), 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రం, ఈడబ్ల్యూఎస్ లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ ఒరిజినల్స్‌తో పాటుగా అన్నీ మూడు సెట్ల జిరాక్సులు, ఆరు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని వివరించారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 9.30 నుంచి విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరిగే స్పాట్ అడ్మిషన్లకు నేరుగా హజరు కావచ్చని పేర్కొన్నారు.
Schools are Closed: బడులు మూత.. విద్యార్థుల గోస
సీటు పొందిన వారు కళాశాల వార్షిక ఫీజు రూ.4,700తో పాటుగా బీసీ, ఓసీలు రూ.1,100, ఎస్సీ, ఎస్టీలు రూ.350 కౌన్సెలింగ్ ఫీజును వెంటనే అక్కడే చెల్లించాలని తెలిపారు. స్పాట్ అడ్మిషన్ పొందిన వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి స్కాలర్‌షిప్‌లు రావని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు.