DEO Ashok: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి
Sakshi Education
ఆసిఫాబాద్ రూరల్: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని డీఈవో అశోక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జూలై 26న నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(న్యాస్) శిక్షణ కార్యక్రమానికి హాజరై రిసోర్స్ పర్సన్లకు సూచనలు చేశారు.
డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. ప్రతిరోజూ తరగతి గదిలో ప్రవేశించడానికి ముందే ఆ పాఠ్యాంశానికి సంబంధించి కనీస అభ్యసన సామర్థ్యాలు ఏం ఉన్నాయి? ఏ విధంగా సాధింపజేయాలి..?
చదవండి: Sports Schools: స్పోర్ట్స్ స్కూల్‌లో ఏడుగురికి కొత్తగా పోస్టింగ్
అని పాఠ్య ప్రణాళికలు, బోధన అభ్యసన సామగ్రి రూపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌వో శ్రీనివాస్, హెచ్‌ఎం సుభాష్ పాల్గొన్నారు.
Published date : 27 Jul 2024 03:52PM