Schools are Closed: బడులు మూత.. విద్యార్థుల గోస
Sakshi Education
బెజ్జూర్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగుతుండటంతో బెజ్జూర్ మండలంలోని పదికి పైగా పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదు.
బడులు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నా రు. బెజ్జూర్ మండలంలోని సోమిని, మొగవెళ్లి, సుశ్మీర్, తలాయి, తిక్కపల్లి, భీమారం, ఇప్పలగూడ, నాగేపల్లి, గెర్రెగూడ, పాతసోమిని, కోయపల్లి, కొత్త గెర్రె, పాత గెర్రె గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చదవండి: Education Budget: చదువుకు పెరిగిన పద్దు
బెజ్జూర్ మండల కేంద్రంతోపాటు కాగజ్‌నగర్ పట్టణం నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఒర్రెలు, వాగులు ఉప్పొంగడంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు చేరుకోలేక పోతున్నారు. టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
Published date : 27 Jul 2024 04:10PM