No Salary : జులై ముగియనున్నది.. ఇంతవరకు అందని జూన్ నెల జీతం.. ఉపాధ్యాయుల పరిస్థితి!
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ సిబ్బందికి జూన్ నెల జీతం ఇప్పటికీ అందని పరిస్థితి. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, గోరంట్ల, ఆరెకల్, నంద్యాల జిల్లాలో డోన్, నెరవాడ, బేతంచెర్ల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, సున్నిపెంట ప్రాంతాల్లో బాల బాలికలకు ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డోన్, బేతంచెర్ల, నెరవాడ స్కూల్స్ జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి.
Job Mela : ఈనెల 30న జాబ్ మేళా.. ఎక్కడ!
ఈ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో రెగ్యులర్, గెస్ట్ ఫ్యాకల్టీ, సీఆర్‌టీలు (మూడు విభాగాలుగా) విద్యా బోధన చేస్తున్నారు. అలాగే, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాల్గవ తరగతి సిబ్బందిని నియమించారు. ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న వారిలో 10 పద్దు కింద ఉన్న 10 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు అందాయని, మిగిలిన 90 శాతం మంది ఉద్యోగులకు నేటికీ జీతాలు అందని పరిస్థితి నెలకొంది.
Kargil Vijay Diwas: 25వ కార్గిల్ విజయ్ దివస్.. అమర జవాన్లకు నివాళులర్పించిన మోదీ
నంద్యాల జిల్లాలోని సున్నిపెంటలో 70, నెరవాడలో 59 మందితో పాటు మిగిలిన అన్ని పాఠశాలలో 20 నుంచి 40 మంది దాకా ఉపాధ్యాయులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని పాఠశాలల్లో దాదాపు 350 మందికి పైగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. జూలై నెల గడిచిపోతున్నా, జూన్ నెల జీతాలు విడుదల కాకపోవడం పట్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తమవుతోంది.
Fertilizer Subsidies: సబ్సిడీపై తక్కువ ధరకు ఎరువులు.. మూడు నెలల్లో రూ.37,000 కోట్ల సబ్సిడీ!