Kargil Vijay Diwas: 25వ కార్గిల్ విజయ్ దివస్.. అమర జవాన్లకు నివాళులర్పించిన మోదీ
ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమర జవాన్లకు నివాళులర్పించారు. వారి కుటుంబీకులతో ముచ్చటించారు. కార్గిల్ యుద్ధంలో చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్‌కు ఇంకా బుద్ధి రాలేదంటూ మోదీ మండిపడ్డారు.
ఈ సందర్భంగా పాక్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనిక వీరుల శౌర్యం ముందు పాక్ ముష్కరులు మోకరిల్లారు. అయినా ఆ దేశం ఎన్నో వికృత యత్నాలకు పాల్పడింది. అవన్నీ దారుణంగా విఫలవుతున్నా గుణపాఠం నేర్వడం లేదు. పొలిమేరల నుంచి వారికి నేరుగా వినబడేలా హెచ్చరిస్తున్నా. ఉగ్ర మూకల దన్నుతో పన్నుతున్న ఇలాంటి కుట్రలు సాగవు. ముష్కరులను మన సైనిక దళాలు నలిపేస్తాయి. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేస్తాం’ అన్నారు. భూతల స్వర్గమైన కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాంతిభద్రతలు నెలకొంటున్నాయన్నారు.
Kargil Vijay Diwas: 4 రోజుల్లో 160 కి.మీ.లు పరిగెత్తిన ఆర్మీ మాజీ అధికారిణి!
టన్నెల్‌లో మోదీ ‘బ్లాస్ట్’
లేహ్‌కు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బయటి ప్రపంచంతో సంబంధాలు కల్పించనున్న షింకున్ లా టన్నెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వర్చువల్‌గా తొలి బ్లాస్ట్ చేసి పనులను ప్రారంభించారు. 15,800 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పొడవు 4.1 కి.మీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న సొరంగంగా నిలవనుంది.
‘విజయ్ దివస్’లో ముర్ము
అమర జవాన్లకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఘనంగా నివాళులర్పించారు. ‘1999లో ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్ మంచుకొండల్లోకి చొరబడ్డ పాక్ సైన్యాన్ని మన సైనిక దళాలు అసమాన శౌర్య సాహసాలతో చావు దెబ్బ తీశాయి. ఆ క్రమంలో అమరుడైన ప్రతి సైనికునికీ శిరసు వంచి అభివాదం చేస్తున్నా’ అని పేర్కొన్నారు.
International Moon Day: నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం.. శశికాంతుని సంగతులు ఇవే..