International Moon Day: నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం.. శశికాంతుని సంగతులు ఇవే..
జూలై 20, 1969 నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి పై కాలు మోపిన రోజు. అతడే చెప్పినట్టు అది ‘మానవ జాతి ముందంజ’. అయినా సరే.. నేటికీ చందమామ ఒక నిగూఢ దీపం. రహస్యాల మయం. మానవజాతికి ఈ రేరాజు ఆత్మీయుడు, అందమైన స్నేహితుడు, ప్రియతముడు, మేనమామ. అతని చుట్టూ ఎన్నో కథలూ గాథలూ కల్పనలు. జూలై 20వ తేదీ ‘ఇంటర్నేషనల్ మూన్ డే’.
శశికాంతుని సంగతులు కొన్ని ఇవే..
కుందేలు ఇలా వచ్చిందట!
చంద్రుడిపై కుందేలు అనేది అందమైన అబద్ధమైనా అది మనకు అమితంగా ఇష్టమైన అబద్ధం! అసలు మన కుందేలు అక్కడెక్కడో ఉన్న చంద్రుడిపైకి ఎలా చేరింది? ప్రపంచ వ్యాప్తంగా పాచుర్యంలో ఉన్న ఒక నమ్మకం ప్రకారం.... బుద్ధుడు ఊరూరూ తిరిగి, బోధనలు చేసి అలిసిపోయాడు. ఆకలితో ఉన్నాడు. ఇది గమనించిన జంతువులు తమకు తోచిన పరిధిలో బుద్ధుడు తినడానికి రకరకాల పదార్థాలు తీసుకువచ్చాయి. పాపం! ఒక కుందేలు దగ్గర మాత్రం ఏమీ ఉండదు. ‘నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’ అంటూ మంటల్లో దూకి చనిపోతుంది కుందేలు. కుందేలు ఆత్మత్యాగానికి చలించిన బుద్ధుడు దానికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. చంద్రుడిపై ఉండి కనువిందు చేసేలా వరమిస్తాడు.
మూడుసార్లు పుట్టాడు...
ఎవరైనా సరే ఒక్కసారే పుడతారు. పురాణాల ప్రకారం చంద్రుడు మాత్రం మూడుసార్లు పుట్టాడు. అందుకే చంద్రుడిని త్రిజన్మి అని కూడా అంటారు. చంద్రుణ్ణి మొదటిసారి బ్రహ్మ సృష్టించాడు. రెండోసారి అత్రి మహర్షి కన్నుల నుంచి ఉద్భవించాడు. రాక్షసులు, దేవతల క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు చంద్రుడు పునర్జన్మ పొందాడు.
డస్ట్‌బిన్ కాదు..
మనిషంటేనే నిరంతరం చెత్తను పారబోస్తుండే జీవి. అతడా చెత్త వేయడానికి భూగ్రహం సరిపోక చంద్రుని మీదా బోలెడంత పారబోస్తున్నాడు. పనికి రాకుండా పోయిన రోవర్లూ, విఫలమైన రాకెట్లూ, పంపిన ఉపగ్రహాలూ, ఆస్ట్రొనాట్ల బూట్లూ, బ్లాంకెట్లూ ఇలాంటివెన్నో అక్కడ. అంతరిక్ష ప్రయాణికులు బ్యాగుల్లో పోసి అక్కడ పారబోసిన యూరిన్ బ్యాగులే 100కు పైగా ఉన్నాయక్కడ. ఇలా ఇప్పటివరకూ చంద్రుడి మీద మనిషి పారబోసిన చెత్త బరువు ఎంతో తెలుసా? అక్షరాలా 2,27,000 కిలోలు.
Nelson Mandela International Day: జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
చంద్రపాలు..
మనకు భూకంపాలలాగే చంద్రుడి మీదా చంద్రకంపాలు వస్తుంటాయి. ఇంగ్లిషులో మూన్‌క్వేక్స్. ఇవి మళ్లీ నాలుగు రకాలు. చాలా లోతుగా వచ్చేవి డీప్ క్వేక్స్, ఉల్కలేవైనా చంద్రుణ్ణి ఢీకొడితే వచ్చేవి మీటియోరైట్ ఇంపాక్ట్స్, సూర్యుడి ఉష్ణోగ్రతతో వచ్చేవి థర్మల్ క్వేక్స్.. ఇవి మూడూ ఒకరకం. కానీ ‘షాలో మూన్ క్వేక్స్’ మాత్రం చాలా భయంకరం. భూకంపం సెకన్లపాటు కొనసాగితేనే మహా ఉత్పాతం కదా.. కానీ చంద్రకంపం దాదాపు పదినిమిషాలు మొదలుకొని అరగంట పాటూ అదేపనిగా వస్తుంది.
లూనార్ స్మెల్..
చంద్రునికో వాసన కూడా ఉంటుంది. దాన్నే ‘లూనార్ స్మెల్’ అంటారు. అక్కడ వాతావరణం ఉండదు. అప్పుడు స్మెల్ ఎలా అనే అనుమానం రావచ్చు. అపోలో–11కు చెందిన ఆస్ట్రొనాట్స్‌అందరి స్పేస్ సూట్‌లకు అంటుకుపోయి ఒకేలాంటి వాసన కొట్టడంతో ఈ విషయం తెలిసొచ్చింది. ఘాటైన మెటాలిక్ స్మెల్‌లాగా. క్రాకర్స్ కాలిపోయాక బాగా మండిన గన్‌పౌడర్‌లా ఉండే వాసన ఇదంటూ ఖచ్చితంగా తెలిపినవాడు హరిసన్ జాక్ స్మిత్ అనే అపోలో–17 కు చెందిన సైంటిస్ట్ ఆస్ట్రొనాట్.
ఆఖరి మజిలీ..
పాపం.. అప్పుడప్పుడూ అతడు శశికాంతుడా శ్మశానమా అనే డౌటు కూడా వస్తుంటుంది. చంద్రుడి మీద తమ చితాభస్మం పడాలని చాలా మంది భూలోక వాసుల కోరిక. అందుకే 450 బీసీ కాలం నుంచే కొందరు తమ చితాభస్మాన్ని చంద్రుడి మీద పడేలా ఎత్తైన ప్రదేశం నుంచి ఆకాశంలోకి విసిరేయమని వీలునామా రాసేవారు. యూజీన్ షూమాకర్ అనే ఆస్ట్రొనాట్‌కు చంద్రుని మీదకు వెళ్లాలని కోరిక. అయితే అతడు ఓ శారీరక లోపం కారణంగా చంద్రుణ్ణి చేరలేకపోయాడు. కానీ ఏనాటికైనా చంద్రుణ్ణి చేరాలన్న అతడి కోరిక నెరవేరకుండానే కారు యాక్సిడెంట్‌కు గురై 1997లో మరణించాడు.
World Sports Journalists Day: జూలై 2న అంతర్జాతీయ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం
అతడి కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్న నాసా.. అతడి భార్య, పరిశోధనల్లో సహచరి అయిన కరోలిన్ దగ్గర్నుంచి అనుమతి తీసుకుని లూనార్ ప్రాస్పెక్టర్ అనే ఉపగ్రహోపకరణంతో చంద్రుడిపైన దక్షిణ ధ్రువంలోని ఓ క్రేటర్‌లోకి సమాధయ్యేలా చితాభస్మాన్ని జల్లి 1998లో అతడి కోరిక తీర్చారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ లాంటివాళ్లు తమ స్పేస్ ఎక్స్‌తో 2019లో 152 మంది చితాభస్మాల్ని అంతరిక్ష వైతరణిలో నిమజ్జనం చేశారు.
మూన్ డస్ట్ ఫీవర్
ప్రస్తుతానికి ఎవరు పడితే వారు ఎప్పుడంటే అప్పుడు వెళ్లడానికి చంద్రుడేమీ పిక్నిక్ స్పాట్ కాదు. మామూలు వ్యక్తులు చంద్రుడి మీదకి వెళ్లడం సాధ్యం కాదు. అక్కడ ఉండే దుమ్మూధూళికి మూన్ డస్ట్ అని పేరు. అది పీల్చడం ఎంతో ప్రమాదకరం. స్పేస్ సూట్ తొడుక్కుని వెళ్లినా బట్టల్లోకి చేరిపోతుంది. అది ‘లూనార్ హే ఫీవర్’ అనే సమస్యకు దారితీస్తుంది. దీన్నే మూన్ డస్ట్ ఫీవర్ అని కూడా అంటారు.
ధారాసింగ్ ముందే అడుగు పెట్టాడు..
‘ఇదెలా సాధ్యం!’ అనుకోవద్దు. సినిమాల్లో ఏదైనా సాధ్యమే కదా! విషయంలోకి వస్తే.. 1967లో హిందీలో ‘చాంద్ పర్ చడాయి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో ప్రఖ్యాత రెజ్లర్ ధారాసింగ్ వ్యోమగామి ఆనంద్ యాత్రలో నటించాడు. తన అసిస్టెంట్ ‘భాగు’తో కలిసి చంద్రుడిపై అడుగు పెట్టిన ఆనంద్ అక్కడ మాన్‌స్టర్‌లతో వీరోచితంగా పోరాడుతాడు. ఈ ఫైటింగ్ విషయం ఎలా ఉన్నా ‘చంద్రయాన్’ లాంటి సందర్భాలలో ఈ సినిమాలోని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు అతడి కుమారుడు విందు ధారాసింగ్.
World Population Day 2024: జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
Tags
- International Moon Day 2024
- Neil Armstrong
- International Moon Day Date
- History
- Significance
- Moon Day
- Moon Smell
- Scientist Astronaut
- NASA
- Eugene Shoemaker
- Chand Par Chadayee
- Dara Singh
- Importent days
- Sakshi Education Updates
- InternationalMoonDay
- MoonMysteries
- FirstManOnTheMoon
- July201969
- SakshiEducationUpdates