World Population Day 2024: జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
నానాటికి పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, జనాభా పెరుగుదల పరిణామాలు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏడాది జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
1987, జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆ రోజును "ప్రపంచ జనాభా దినోత్సస్తవం"గా గుర్తించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగ ప్రజలలో అవగాహన తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది.
ఈ సంవత్సరం థీమ్ ఇదే..
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంయుక్తంగా ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‌ను నిర్ణయిస్తాయి. ఈ సంవత్సరం థీమ్: 'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి (To Leave No One Behind, Count Everyone)
ముఖ్యాంశాలు..
➤ ఐరాస లెక్కల ప్రకారం 20 ఏళ్ల తరువాత జూలై 11, 2007లో చూస్తే ప్రపంచ జనాభా 6,602,226,175కు చేరుకుంది.
➤ కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, మాతృ ఆరోగ్యం, మానవ హక్కులు వంటి జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడమే ప్రపంచ జనాభా దినోత్సవ లక్ష్యం.
➤ ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే, భవిష్యత్ తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్దికి అడ్డంకులను సృష్టిస్తుం దనేది ప్రధాన ఆందోళన.
➤ ప్రస్తుత ప్రపంచ జనాభా ఇరవయ్యవ శతాబ్దం మధ్యలో ఉన్నదానికంటే మూడు రెట్లు ఎక్కువ.
➤ అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం. ఈ రెండూ వందకోట్ల కంటే ఎక్కువ జనాభా ఈ దేశాల్లో ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
➤ 2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని ఐరాస అంచనా. అలాగే 2080ల మధ్యలో 10.4 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
World Sports Journalists Day: జూలై 2న అంతర్జాతీయ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం
Tags
- World Population Day 2024
- UNFPA
- World population Day
- UNDP
- UN Population Fund
- To Leave No One Behind
- Count Everyone
- World Population Day 2024 Theme
- population issues
- sustainable development
- importent dates
- Importent days
- Sakshi Education Updates
- July 11
- SustainableDevelopmentGoals
- GlobalHealth
- DemographicData
- UNDP
- UNFPA
- PopulationAwareness
- GlobalDemographics
- SocialInclusion
- Equity
- SakshiEducationUpdates