World Rose Day 2024: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ ప్రపంచ రోజ్ డే
అయితే ప్రపంచ రోజ్ డేకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రోజ్‌డే జరుపుకుంటారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.
క్యాన్సర్ రోగులకు అంకితం చేసిన నేటి రోజున క్యాన్సర్ బాధితులకు గులాబీలను అందజేసి, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు. ప్రపంచ గులాబీ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమయ్యింది? దీనివెనుక ఎవరు ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కెనడాకు చెందిన మెలిండా అనే బాలిక జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల వయసుకే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ చిన్నారికి వైద్యులు ఎలాంటి వైద్య సహాయం అందించలేకపోయారు. ఆ చిన్నారి ఇక రెండు వారాలు మాత్రమే జీవించి ఉంటుందని తేల్చిచెప్పారు. అయితే మెలిండా ఎంతో ధైర్యంతో ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడింది. ఈ సమయంలో ఆ చిన్నారి ఇతర క్యాన్సర్ బాధితులతో గడిపింది. తోటి బాధితులు ఆమెకు కవితలు, కథలు చెబుతూ ఆమెను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.
World Water Monitoring Day: సెప్టెంబర్ 18వ తేదీ నీటి పర్యవేక్షణ దినోత్సవం
ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆ చిన్నారి సెప్టెంబర్‌లో మృతి చెందింది. దీని తరువాత ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని సెప్టెంబర్ నెలలో నాల్గవ ఆదివారం నాడు జరుపుకుంటారు.
ఈ రోజున కేన్సర్ బాధితులకు గులాబీ పూలు అందించి, వారికి ధైర్యం చెబుతూ ప్రపంచమంతా వారికి అండగా నిలుస్తుందనే సందేశాన్ని తెలియజేస్తారు. గులాబీని ప్రేమ, ఆనందాలకు గుర్తుగా పరిగణిస్తారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారెవరైనా మీకు తెలిస్తే, మీరు కూడా వారికి గులాబీని అందించి ధైర్యాన్ని చెప్పండి.
September Important Days: సెప్టెంబర్ నెలలోని ముఖ్యమైన రోజులు ఇవే..