World Water Monitoring Day: సెప్టెంబర్ 18వ తేదీ నీటి పర్యవేక్షణ దినోత్సవం
నీటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనే ఉద్ధేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.
2003లో అమెరికా యొక్క క్లీన్ వాటర్ ఫౌండేషన్ ప్రపంచ విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. నీటి వనరులను రక్షించడానికి 1972, అక్టోబర్ 18వ తేదీ యునైటెడ్ స్టేట్స్ దేశంలో ప్రవేశపెట్టిన పరిశుభ్రత నీటి చట్టం వార్షికోత్సవానికి గుర్తుగా ఒక నెలరోజుల ముందుగా (సెప్టెంబర్ 18వ తేదీ) ఈ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. 2006లో ఈ కార్యక్రమ సమన్వయం నీటి పర్యావరణ సమాఖ్య, అంతర్జాతీయ నీటి సంఘాలకు, ఆ తరువాత 2015 జనవరిలో ఎర్త్ ఎకో ఇంటర్నేషనల్‌కు అప్పగించబడింది.
Engineers Day: సెప్టెంబర్ 15వ తేదీ జాతీయ ఇంజనీర్ల దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..
దీని ప్రాముఖ్యత ఇదే..
నీటి కొరత: ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత పెరుగుతున్న సమయంలో.. నీటిని పరిరక్షించడం అత్యంత అవసరం.
నీటి కాలుష్యం: పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ రసాయనాలు, ఇతర కాలుష్య కారకాలు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి.
జీవవైవిధ్యం: స్వచ్ఛమైన నీరు జీవవైవిధ్యానికి అత్యంత ముఖ్యం.
ఆరోగ్యం: స్వచ్ఛమైన నీరు మానవ ఆరోగ్యం కోసం అత్యంత అవసరం.
September Important Days: సెప్టెంబర్ నెలలోని ముఖ్యమైన రోజులు ఇవే..