Skip to main content

Internet Day: అక్టోబర్ 29వ తేదీ అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం

ప్ర‌తి సంవ‌త్స‌రం అక్టోబర్ 29వ తేదీ అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు.
International Internet Day is celebrates on 29th October

ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగానికున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకునేందుకే ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1969, అక్టోబర్‌ 29న ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్‌కు మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని  పంపారు. నాడు ఇంటర్నెట్‌ను అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్‌వర్క్(ఆర్పానెట్‌) అని పిలిచేవారు.

ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కనెక్ట్ చేసింది. ఎటువంటి సమాచారాన్నయినా తక్షణమే అందుకునేలా చేసింది. వివిధ రంగాలలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికింది. మొదటి ఎలక్ట్రానిక్‌ సందేశాన్ని 1969లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన చార్లెస్.. స్టాన్‌ఫోర్డ్ పరిశోధనా సంస్థకు పంపారు. ఇది గ్లోబల్ నెట్‌వర్క్ అభివృద్ధికి పునాది వేసింది. 

United Nations Day: అక్టోబర్ 24వ తేదీ ఐక్యరాజ్యసమితి దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరపుకుంటున్నారు. ఈ దినోత్సవం సందర్భంగా.. ఇంటర్నెట్ చరిత్రకు సంబంధించిన అంశాలను వివిధ పత్రికల్లో ప్రచురిస్తుంటారు. టెక్ ఔత్సాహికులు ఈ రోజున కొత్త ఆన్‌లైన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు వర్చువల్ సెమినార్లు ఏర్పాటు చేస్తారు. నేడు పాఠశాలలలో పాటు వివిధ సంస్థలలో డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, ఇంటర్నెట్ భవిష్యత్తుపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

Important Days: ఈ ఏడాది అక్టోబ‌ర్ నెల‌లోని ముఖ్యమైన రోజులు ఇవే..

Published date : 29 Oct 2024 03:23PM

Photo Stories