National Engineers Day: సెప్టెంబర్ 15వ తేదీ జాతీయ ఇంజనీర్ల దినోత్సవం
1968లో కేంద్ర ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజును జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా ప్రకటించింది.
ఈ సంవత్సరం థీమ్ ఇదే..
"సుస్థిర భవిష్యత్తుకు నూతన ఆవిష్కరణలు" (Innovating for a Sustainable Future). ఈ థీమ్ ఇంజినీర్లు ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడానికి, అలాగే భవిష్యత్తులో సుస్థిరతను ఏర్పరచడానికి వారు తీసుకునే పాత్రను ప్రతిబింబిస్తుంది.
విశ్వేశ్వరయ్య చరిత్ర..
విశ్వేశ్వరయ్య కర్ణాటకలోని మైసూర్ దగ్గర ముడినేహల్లి అనే కుగ్రామంలో 1861లో జన్మించారు. అనేక కష్టనష్టాలకు సైతం ఓర్చుకొని విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ట్యూషన్‌లు చెప్పుకుంటూ ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసి మొదటి ర్యాంకు సాధించారు. చదువు పూర్తయిన వెంటనే మహరాష్ట్రలోని నాసిక్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం పొందాడు.
దేశానికి రాబోయే రోజుల్లో వ్యవసాయం, పరిశ్రమలే అవసరమని గుర్తించి వాటిని వృద్ధిలోకి తీసుకురావడం ద్వారా అనేక సేవలు చేశాడు. 101 సంవత్సరాల తన జీవితంలో దాదాపుగా 80 ఏళ్లు దేశం కోసం అహర్నిశలు పని చేశాడు. విశ్వేశ్వరయ్య చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1955లో భారతరత్న ప్రదానం చేసి సత్కరించింది. విశ్వేశ్వరయ్య ఈ దేశానికి చేసిన సేవలకు గాను 1968లో తన పుట్టినరోజును జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Teachers Day: సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం
హైదరాబాద్‌లో 1908లో మూసీ నదికి వరదలు వచ్చాయి. నాటి అల్లకల్లోలమైన పరిస్థితుల్లో అనేక వంతెనలు నిర్మించి మూసీ నదికే ముక్కుతాడు వేసిన ఇంజనీర్ విశ్వేశ్వరయ్య. నాసిక్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా సింధూ నది నీటిని సుక్కూరు ప్రాంతానికి అంటే దాదాపుగా 480 కిలోమీటర్లు తీసుకురావడం కోసం విశ్వేశ్వరయ్య చేసిన యోచన చూసి మిగతా ఇంజనీర్లు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తర్వాత నీటిపారుదలపై మహరాష్ట్రలో పలు కమిటీలు వేసినప్పుడు విశ్వేశ్వరయ్య సలహాలు విని బ్రిటిష్ అధికారులు సైతం అవాక్కయ్యారు. ఇరిగేషన్‌లో బ్లాక్ సిస్టమ్ అనే నూతన విధానాలను తీసుకువచ్చి వ్యర్ధమైన నీటిని నిల్వ చేసి మరల వాడేవారు.
1952లో అంటే 91 సంవత్సరాల వయసులో గంగానది మీద బ్రిడ్జి కట్టడానికి అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తన జీవితమంతా తన నైపుణ్యాన్ని దేశ నిర్మాణానికి వినియోగించారు. తన దార్శనికత వల్లే నేటికీ కర్ణాటక మైసూర్ బలంగా, సుసంపన్నంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
September Important Days: సెప్టెంబర్ నెలలోని ముఖ్యమైన రోజులు ఇవే..
Tags
- National Engineers Day
- 15th September
- Mokshagundam Visvesvaraya
- Engineers Day theme
- Engineers Day History
- History of National Engineers Day
- Karnataka
- Sakshi Education Updates
- Important Days
- Engineers Day 2024
- Innovating for a Sustainable Future
- Engineering contributions
- Engineering achievements
- Engineers Day History
- Engineering challenges