Skip to main content

World Day to Combat Desertification and Drought: జూన్ 17వ తేదీ ప్రపంచ ఎడారీకరణ, కరువు నిరోధక దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 17వ తేదీ ప్రపంచ ఎడారీకరణ, కరువు నిరోధక దినోత్సవం జరుపుకుంటాము.
World Day to Combat Desertification and Drought 2024

1995 నుంచి ప్రతి ఏడాది జూన్ 17వ తేదీ ఎడారీకరణ, కరువును ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ (UNGA) ఈ దినోత్సవాన్ని జరుపుతోంది.  ఈ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం ఎడారీకరణ, కరువు గురించి అవగాహన పెంచడం, వాటిని ఎదుర్కోవడానికి పద్ధతులను వ్యాప్తి చేయడం.

ఎడారీకరణ, భూమి క్షీణత, కరువు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పర్యావరణ సవాళ్లలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూభాగంలో ఇప్ప‌టికే 40% భూభాగం క్షీణించిపోయిందని అంచనా. వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాలు ఎడారీకరణ, కరువుకు దోహదపడుతున్నాయి.

ఈ ఏడాది థీమ్ ఇదే..
2024 థీమ్ "భూమి కోసం ఐక్యత, మన వారసత్వం. మన భవిష్యత్తు(United for Land. Our Legacy. Our Future)".

World Blood Donor Day: నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే..

➤ ప్ర‌స్తుతం ఉత్తర ఆఫ్రికా అంతటా విస్తరించి ఉన్న సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి.
➤ దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారి భూమధ్యరేఖ ప్రాంతంలో అత్యంత పొడి ప్రాంతంగా పేరు తెచ్చుకుంది.
➤ ఎటువంటి ప్రధాన సహజ ఎడార్లు లేనిది యూరప్ మాత్రమే.
➤ అంటార్కిటికా ఖండంలో ఉన్న అంటార్కిటికా ఎడారి ప్రపంచంలోనే అతిశీతల ఎడారి.
➤ చైనా, మంగోలియాలలో విస్తరించి ఉన్న గోబీ ఎడారి ఆసియాలో అతిపెద్ద, అతిశీతల ఎడారి.

Published date : 19 Jun 2024 09:15AM

Photo Stories