ISRO: సీఈ-20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్ష సక్సెస్
తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో వారి ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఈ పరీక్షకు వేదికైంది.
పరీక్ష వివరాలు..
పరీక్ష ప్రదేశం: తమిళనాడులోని మహేంద్రగిరి, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్.
ప్రయోగంలో శక్తి: సీఈ20 ఇంజిన్ 19 టన్నుల థ్రస్ట్ ఇస్తూ సక్సెస్‌ఫుల్‌గా పనిచేసింది. ఎల్వీఎం మార్క్–3 రకం రాకెట్‌లో పైభాగానికి తగు శక్తిని అందివ్వడంలో సీఈ20 ఇంజన్ సాయపడుతుంది.
భవిష్యత్తు ప్రయోగాలు: ఈ ఇంజిన్ 20 టన్నుల థ్రస్ట్ స్థాయిని అందించి, గగన్‌యాన్ మిషన్‌లో అవసరమైన శక్తిని అందించడంలో కూడా సహాయం చేయగలదు. అదేవిధంగా, సీ32 స్టేజ్‌లో పేలోడ్ పరిమాణాన్ని పెంచేందుకు 22 టన్నుల థ్రస్ట్‌ను అందించగల ఇంజిన్‌గా కూడా ఉపయోగపడవచ్చు.
ఇంజిన్ రీస్టార్: బహుళధాతు ఇగ్నైటర్ సామర్థ్యం కూడా విజయవంతంగా పరీక్షించబడింది. ఇది ఇంజిన్‌ను మళ్లీ రీస్టార్ చేసే కీలక భాగం.
Gaganyaan Mission: వెల్‌డెక్ రికవరీ ట్రయల్ విజయవంతం
నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్: సముద్ర ఉపరితల స్థాయిలో ఈ ఇంజిన్‌కు 50 ఎంబార్ స్థాయిలో అతి తీవ్రమైన శక్తి విడుదల అవుతుందని ఇస్రో తెలిపింది. ఇది ఇంజిన్‌కు సవాళ్లను సృష్టించగలదు. కానీ ఈ సమస్యను అధిగమించేందుకు వినూత్న నాజిల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను ఉపయోగించడం ద్వారా ఇస్రో విజయవంతంగా పరీక్షలు నిర్వహించింది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)