Skip to main content

Imprisonment for Children: కఠిన చట్టం.. పెద్దల మాదిరిగానే పిల్లలకూ జైలు శిక్షలు

చిన్న పిల్లలకు కూడా పెద్దల మాదిరిగానే శిక్షలు విధించే చట్టాన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు.
Queensland to Impose Adult Prison Sentences on 10 Year Old Children

హత్య, తీవ్ర దాడి, దోపిడీల వంటి 13 నేరాలకు పాల్పడినట్లు రుజువైతే 10 ఏళ్ల బాలలకు సైతం పెద్దల మాదిరిగానే శిక్షలు వేసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ రాష్ట్రం చట్టం చేసింది. హత్య నేరానికైతే కనీసం 20 ఏళ్లు ఎటువంటి పెరోల్‌ లేకుండా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముంది.

గతంలో ఇది గరిష్టంగా పదేళ్లే ఉండేది. క్వీన్స్‌ల్యాండ్‌లో గత 14 ఏళ్లలో పిల్లల నేరాలు సగానికి సగం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  2022 నుంచి నేరాల రేటు స్థిరంగా కొనసా తోంది. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్వీన్స్‌ల్యాండ్‌ జైళ్లలోనే ఎక్కువ మంది పిల్లలున్నారు. 

పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతుండటంపై ప్రజాగ్రహం వ్యక్తమవు తున్నందు వల్లే చట్టాలను కఠినతరం చేశామని, దీనివల్ల నేరాలు తగ్గుతాయని ఆశిస్తున్నామని ప్రభుత్వం అంటోంది. అయితే, నేరాలు తగ్గడం అంటుంచి పెరిగే ప్రమాదముందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇది చిన్నారుల మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలకు భంగకరమని ఐరాస పేర్కొంది. 

Abu Mohammed al-Golani: ఉగ్రవాది నుంచి దేశాధినేత వరకు.. ఈ అబూ మొహమ్మెద్ అల్‌ గోలానీ ఎవరు?

Published date : 13 Dec 2024 12:30PM

Photo Stories