INS Tushil: భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ తుశిల్
అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ‘ఐఎన్‌ఎస్ తుశిల్’ భారత నౌకాదళంలో చేరింది. రష్యాలో తయారైన ఈ యుద్ధ నౌక డిసెంబర్ 9వ తేదీన భారత నౌకాదళంలో చేరింది. ఈ కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
‘ఐఎన్‌ఎస్ తుశిల్’ చేరికతో హిందూ మహాసముద్రంలో భారత నౌకాదళం పోరాట సామర్థ్యం మరింత పెరిగింది. ఈ ప్రాంతంలో చైనా యొక్క కదలికలు గత కొన్నేళ్లలో పెరుగుతున్న నేపథ్యంలో.. భారత నౌకాదళం ఈ యుద్ధ నౌకతో తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలపరుస్తోంది.
Andromeda Galaxy: నక్షత్ర మండలంలో తొలిసారి పరారుణ ఉద్గారాల గుర్తింపు
ఈ యుద్ధ నౌక రష్యాలో నిర్మించబడింది. 2016లో భారత్, రష్యా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, 250 కోట్ల డాలర్ల విలువతో నాలుగు స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌకల నిర్మాణం మొదలైంది. ఇందులో.. రెండు యుద్ధనౌకలను రష్యాలో, మిగతా రెండు యుద్ధనౌకలను భారత్‌లో నిర్మించాలని నిర్ణయించారు. ‘ఐఎన్‌ఎస్ తుశిల్’ యొక్క బరువు 3,900 టన్నులు కాగా, పొడవు 125 మీటర్లు.
ఈ యుద్ధ నౌకలో భారత పరిజ్ఞానం 26 శాతం మేర ఉంది. ఈ యుద్ధనౌకలో శక్తిమంతమైన ఆయుధాలు ఉంటాయి. వాటిలో గైడెడ్ మిసైళ్లను, అధునాతన రాడార్లు, ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి.