Most Corrupt Country ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాలివే.. భారత్ స్థానం..?

ఈ జాబితాను రూపొందించడంలో ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ర్యాంకులు నిర్ణయిస్తారు. అవినీతి అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా తీవ్రమైన సమస్యగా మారిందని ఈ సంస్థ పేర్కొంది.
ఈ జాబితాలో.. డెన్మార్క్ అవినీతి రహిత దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ తదితర దేశాలు కూడా చాలా మంచి స్థితిలో ఉన్నాయని ప్రకటించారు.
అయితే, భారతదేశం 2024 సంవత్సరంలో 38 స్కోర్‌తో 96వ స్థానంలో ఉందని తెలిపింది. గతేడాది 39 స్కోరుతో 93వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది మూడున్నర స్థానాలు పడిపోయింది. 2023లో భారతదేశం 39 స్కోర్‌తో 93వ స్థానంలో ఉండగా, 2022లో 40 స్కోర్‌తో ఉన్నది.
Online Gambling: ఈ రాష్ట్రంలో ఆన్‌లైన్ జూదం నిషేధం..!
భారతదేశానికి పొరుగునున్న దేశాలు..
పాకిస్తాన్: 135వ స్థానంలో
శ్రీలంక: 121వ స్థానంలో
బంగ్లాదేశ్: 149వ స్థానంలో
చైనా, భారతదేశం కంటే తక్కువ అవినీతి గల దేశంగా 76వ స్థానంలో నిలిచింది.
అమెరికా: 69 నుంచి 65కి పడిపోయింది.
ఇక.. ఫ్రాన్స్, జర్మనీ, రష్యా వంటి పాశ్చాత్య దేశాలు కూడా ఈ సూచికలో క్షీణతను చూపాయి.
అత్యంత అవినీతి దేశాలు..
దక్షిణ సూడాన్: 8 పాయింట్లతో అట్టడుగులో
సోమాలియా: 9 పాయింట్లు
వెనిజులా: 10 పాయింట్లు
సిరియా: 12 పాయింట్లు
2012 నుంచి 32 దేశాలు అవినీతి స్థాయిలను గణనీయంగా తగ్గించుకున్నా, ఇంకా 148 దేశాలు అత్యంత అవినీతి స్థాయిలలో ఉన్నాయి. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపిన ప్రకారం, ఈ దేశాలు ఇంకా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా అవినీతి నియంత్రణలో ముందడుగు పడగలుగుతాయి.
Mount Everest: ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకుంటున్నారా.. అయితే రూ.21 లక్షలు కట్టాల్సిందే..!