Skip to main content

National Vaccination Day 2023: ఆరోగ్యానికి వరం టీకా ఔషధం.. నేడు జాతీయ టీకా దినోత్సవం

ప్రతి సంవ‌త్స‌రం మార్చి 16న జాతీయ టీకా దినోత్సవం లేదా జాతీయ రోగనిరోధక దినోత్సవాన్ని జ‌రుపుకుంటున్నాం.
National Vaccination Day 2023

భారత ప్రభుత్వం టీకాలు తీసుకోవటం వల్ల క‌లిగే లాభాలు, దాని ప్రాముఖ్యత‌ను ప్రజలందరికీ అవగాహణ కల్పించేందుకే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మొద‌ట 16 మార్చి 1995న దేశవ్యాప్తంగా జోనస్‌ ‌సాల్క్‌ను కనుగొన్న పోలియో టీకాలను భారత చిన్నారులు అందరికీ ఉద్యమంగా ‘ఓరల్‌ ‌పల్స్ ‌పోలియో డ్రైవ్‌’ ‌ప్రారంభమైంది. దీనికి గుర్తుగా ప్రతియేడాది 16 మార్చిన  జాతీయ టీకా ‌దినం (నేషనల్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌లేదా ఇమ్యునైజేషన్‌ ‌డే)ను పాటించుట ఆనవాయితీగా మారింది. 2014 మార్చి 27న ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) భారత దేశంతో పాటు ఆగ్నేయాసియా ప్రాంతాల్లోని 11 దేశాల్లో పోలీయో పూర్తిగా నివారణ జరిగినట్లు పేర్కొంది.

జాతీయ టీకా దినోత్స‌వం-2022 నినాదంగా అందరికీ అందుబాటులో టీకాలు(వ్యాక్సీన్ ‌వర్స్క్‌ ‌ఫర్‌ ఆల్‌). 2023కు సంబందించిన నినాదాన్ని ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. పలు ప్రమాదకర వ్యాధులను జీవితకాలం నిరోధించడానికి, ప్రజారోగ్య పరిరక్షణకు, ఆరోగ్య నియంత్రణకు, ప్రాణాలు కాపాడటానికి టీకాలే దివ్య ఔషధాలని ఐరాస, డబ్ల్యూహెచ్‌ఓ ‌పిలుపునిస్తున్నాయి.

Potti Sriramulu: ఆధునిక శిబిచక్రవర్తి అమరజీవి.. నేడు పొట్టి శ్రీరాములు జయంతి

కాగా టీకా పితామహుడిగా పేరు పొందిన ‘ఎడ్వర్డ్ ‌జెన్నర్‌’ ‌స్మాల్‌ఫాక్స్‌, ‘లూయిస్‌ ‌పాస్చర్‌’ ‌కలరా, ఆన్‌‌త్రాక్స్ ‌టీకాలను కనుగొన్నారు. భార‌త‌దేశంలో 19వ శతాబ్దం నుంచి టీకాల ఆవిష్కరణలు జరుగుతేనే ఉన్నాయి. 1940లో పెద్ద ఎత్తున టీకాల ఉద్యమం మొదలైంది. 1960లో ఎంఎంఆర్‌(‌మీసిల్స్, ‌మంప్స్, ‌రుబెల్లా) టీకా, 1972లో ‘స్మాల్‌ఫాక్స్’ను కూడా ‌నిర్మూలించాం. ట్యుబర్‌క్యులోసిస్‌ (‌టిబి) సోకకుండా బీసీజీ (బాసిల్లే కాల్మెట్ గ్యురిన్‌), టైఫాయిడ్‌-‌డిప్తీరియాలు రాకుండా 1978లో టీకాలను ప్రవేశపెట్టారు. ‘ప్రపంచ ఇమ్యునైజేషన్‌ ‌డే’ను నవంబర్ 10న నిర్వహించుకుంటున్నాం.

మిషన్‌ ఇం‌ద్ర ధనుష్.. 
భారత ప్రభుత్వం 2014లో మిషన్ ఇంద్రధనుష్‌ను ప్రారంభించింది. రెండు సంవత్సరాలలోపు పిల్లలు ఇంకా గర్భిణీ స్త్రీలకు అందుబాటులో ఉన్న అన్ని టీకాలతో పూర్తి రోగనిరోధక శక్తిని నిర్ధారించడానికి ఈ మిషన్ ప్రారంభించింది. భారతదేశం మీజిల్స్ ఇంకా రుబెల్లా నిర్మూలన దిశగా ముందుకు సాగుతోంది.  1985లో దేశవ్యాప్తంగా ‘యూనివర్సల్‌ ఇమ్యునైజేషన్‌ ‌ప్రోగ్రామ్‌ (‌యూపిఐ)’ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. పోలియో, టెటనస్‌, ‌రుబెల్లా, మెనిన్‌జైటిస్‌, ‌డిప్తీరియా, న్యుమోనియా,పెర్‌ట్యుసిస్‌, ‌మీసిల్స్, ‌మంప్స్, ‌టీబీ, హెపటైటిస్‌-‌బీలతో పాటు నేడు కరోనా లాంటి భయంకర వ్యాధులకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. 

Himalayas: మంచుకొండల్లో మహాముప్పు.. కరిగిపోనున్న‌ హిమానీనదాలు.. మాయమవనున్న‌ సరస్సులు!

Published date : 16 Mar 2023 06:05PM

Photo Stories