Skip to main content

Principles of Memory: జ్ఞాపక శక్తిని పెంచుకోవాల‌ని అనుకుంటున్నారా.. అయితే ఈ ఏడు సూత్రాలను పాటించండి

ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి పనికి ఏదో ఒక వస్తువుపై ఆధారపడటం సర్వసాధారణంగా మారింది.
These Seven Principles of Super Power Memory

ఇది మోతాదుకు మించటంతో జ్ఞాపక శక్తిపైనా ప్రభావం చూపుతోంది. జ్ఞాపక శక్తి అనేది ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో కీలకం.. చదివిన అంశాలు సరిగా గుర్తుంటేనే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. అందుకే జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి కొన్ని సూత్రాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

విద్యార్థులు తమ జ్ఞాపక శక్తిని పెంచుకు నేందుకు గ్వాలియర్లోని ఆటల్ బిహారీ వాజ్ పేయి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోష్నీ చక్రవర్తి ఏడు సూత్రాలను సూచించారు. అవి.. 

1.తగినంత నిద్ర అత్యంత ప్రధానం..
జ్ఞాపశక్తిని మెరుగుపరచుకోవడానికి అతిముఖ్యమైనది. సరిపడినంత నిద్ర, నిద్ర పోవడం వల్ల మెదడు న్యూరాన్ల సమన్వయాన్ని పెంచుకుంటుంది. విద్యార్థులు ప్రతి రోజు రాత్రి 7-9 గంటల పాటు నిద్రపోవడంతో మంచి ఫలితం ఉంటుంది. 

2. మంచి ఆహారం..
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్లు ఎక్కువగా ఉండే నట్స్, చేపలు, ఆకుకూరలు ఎక్కువగా తినడం మనకు మేలు చేస్తుంది. 

3.శారీరక ధృఢత్వం.. 
వ్యాయామం అనేది మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది. ప్రతి రోజూ నడక. వ్యాయామల చేయడం.. ఆటలు ఆడడం కూడా మన శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత. జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. 

4.సులువుగా గుర్తుంచుకోవడం అలవర్చుకోవాలి..
ఏదైనా ఒక అంశం క్లిష్టంగా ఉంటే దానిని మనకు అనుకూలంగా, సులువుగా గుర్తుండేలా చిన్నచిన్న. అంశాలుగా విడగొట్టి గుర్తుంచుకోవడం సాధన చేయాలి. దీని వల్ల జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. 

5. కొత్త అంశాలపై ఆసక్తి పెంచుకోవాలి.. 
ఏదైనా ఒక కొత్త అంశం గురించి తెలుసుకోవాన్న ఆసక్తిని పెంచుకోవాలి. ఆ విషయాన్ని గురించి ప్రశ్నిస్తూ.. సమగ్రంగా వివరాలు తెలు సుకోవడం వల్ల కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

6. మెడిటేషన్..
ద్యానం అనేది మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు మంచి మార్గం. శ్వాసపైన ధ్యాస పెట్టడం, ధ్యానం సాధన చేయడంతోనూ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

7.తరచూ మననం చేయాలి.. 
ఏదైనా అంశాన్ని బాగా గుర్తుంచుకోవాలంటే ఆ విషయాన్ని ఏదో ఒక రూపంలో పునరావృతం చేసు కుంటూ మననం చేస్తూ ఉండాలి. అందుకు నోట్స్ రాసుకోవడం, ఇతరులకు బోధించడంతో మన జ్ఞాప శక్తి పెరుగుతుంది.

Good Food For Youth: యువత ఈ ఫుడ్ తీసుకుంటే...బెస్ట్‌ హెల్త్‌ మీదే..

Published date : 23 Sep 2024 03:33PM

Photo Stories