Skip to main content

BioMe23: విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారించాలి

సాక్షి, ఎడ్యుకేషన్‌: బయో, ఫార్మా రంగాల్లో ఇటీవల కాలంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారించాలని గిరిజన, గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌ సూచించారు.
Biome23

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతి వనంలో తెలంగాణ గిరిజన, గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న బయోమి–23 అంతర్జాతీయ సదస్సును మంగళవారం రోస్‌ ప్రారంభించారు. 
భ‌విష్య‌త్తు ప‌రిణామాలను అంచ‌నావేయాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్‌ వెల్ఫేర్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ విద్యార్థుల కోసం పలు రంగాల్లో ప్రసిద్ధి చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రొఫెసర్లతో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన బయో, ఫార్మారంగం ప్రపంచ మానవాళిని కాపాడిందన్నారు.

biome23

రాబోయో విపత్కర పరిస్థితులను అంచనా వేసి వాటిని తట్టుకునేందుకు కావాల్సిన పరిశోధన అంశాలపై ఇప్పటినుంచే దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పలుదేశాల నుంచి హాజరైన ఫార్మ నిపుణులు మాట్లాడుతూ.. ఫార్మా రంగానికి హైదరాబాద్‌ రాజధానిగా మారిందని అభిప్రాయపడ్డారు.

Published date : 21 Feb 2023 08:06PM

Photo Stories