Skip to main content

Fertilizer Subsidies: సబ్సిడీపై తక్కువ ధరకు ఎరువులు.. మూడు నెలల్లో రూ.37,000 కోట్ల సబ్సిడీ!

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు రూ.37,000 కోట్ల ఎరువుల సబ్సిడీ అందించినట్లు రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంట్‌లో తెలిపారు.
Government Allocates Rs 37,000 Crore for Fertilizer Subsidies This Fiscal

ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) విధానం ద్వారా రైతులకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి స్పందిస్తూ.. ‘రైతులకు తక్కువ ధరకు ఎరువులు లభ్యమయ్యేలా ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. కొన్ని ఎరువుల తయారీకి సంబంధించి కంపెనీలకు ఇప్పటికే 100 శాతం రాయితీలు అందించాం. రిటైల్ దుకాణంలో అమర్చిన పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల ద్వారా ఆధార్‌తో రైతులు సబ్సిడీపై ఎరువులు పొందుతున్నారు’ అని చెప్పారు.

2010-11 నుంచి ప్రభుత్వం అందిస్తున్న ఎరువుల సబ్సిడీ వివరాలు ఇవే..
➤ 2010-11లో రూ.65,836.68 కోట్లు
➤ 2011-12లో రూ.74,569.83 కోట్లు
➤ 2012-13లో రూ.70,592.1 కోట్లు
➤ 2013-14లో రూ.71,280.16 కోట్లు
➤ 2014-15లో రూ.75,067.31 కోట్లు

➤ 2015-16లో రూ.76,537.56 కోట్లు
➤ 2016-17లో రూ.70,100.01 కోట్లు
➤ 2017-18లో రూ.69,197.96 కోట్లు
➤ 2018-19లో రూ.73,435.21 కోట్లు
➤ 2019-20లో రూ. 83,466.51 కోట్లు

➤ 2020-21లో రూ. 1,31,229.5 కోట్లు
➤ 2021-22లో రూ. 1,57,640.1 కోట్లు
➤ 2022-23లో రూ.2,54,798.9 కోట్లు
➤ 2024-25లో జులై 2024 వరకు అందించిన సబ్సిడీ రూ.36,993.39 కోట్లు

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

‘చట్టబద్ధంగా 45 కిలోల యూరియా బ్యాగ్‌ రూ.242 (ఛార్జీలు, పన్నులు మినహాయింపు)గా ఉంది. యూరియా ఉత్పత్తికి అయ్యే వాస్తవ ఖర్చులు, రైతులకు అందిస్తున్న ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. అందుకోసం ప్రభుత్వ సబ్సిడీలు ఉపయోగపడుతున్నాయి. ఫాస్ఫేట్‌, పొటాష్‌ ఎరువుల కోసం ప్రభుత్వం ఏప్రిల్ 2010 నుంచి న్యూట్రియంట్‌ బేస్ట్‌ సబ్సిడీ(ఎన్‌బీఎస్‌) విధానాన్ని అమలు చేస్తోంది. ఎరువుల ధరలు వాటి ముడి పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. క్రమంగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల్లో మార్పులుంటాయి’ అని మంత్రి చెప్పారు. 

ఎరువుల ఉత్పత్తి వివరాలు..
➤ 2010-11లో 376.25 లక్షల టన్నులు
➤ 2011-12లో 387.78 లక్షల టన్నులు
➤ 2012-13లో 374.94 లక్షల టన్నులు
➤ 2013-14లో 380.46 లక్షల టన్నులు
➤ 2014-15లో 385.39 లక్షల టన్నులు

➤ 2015-16లో 413.14 లక్షల టన్నులు
➤ 2016-17లో 414.41 లక్షల టన్నులు
➤ 2017-18లో 413.61 లక్షల టన్నులు
➤ 2018-19లో 413.85 లక్షల టన్నులు
➤ 2019-20లో 425.95 లక్షల టన్నులు

➤ 2020-21లో 433.68 లక్షల టన్నులు
➤ 2021-22లో 435.95 లక్షల టన్నులు
➤ 2022-23లో 485.29 లక్షల టన్నులు
➤ 2023-24లో 503.35 లక్షల టన్నులు

Union Budget 2024-25: కేంద్ర బడ్జెట్‌ 2024-25.. పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 27 Jul 2024 01:52PM

Photo Stories