RGUKT Admission Counselling : ఆర్‌జీయూకేటీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం.. తొలి రోజు ఇలా!
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) ఎస్‌ఎం పురం క్యాంపస్ ప్రవేశాల కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 11వ తేదీన మెరిట్ లిస్ట్ ప్రకటించారు. కౌన్సెలింగ్‌లో భాగంగా మెరిట్ లిస్ట్ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు శుక్రవారం 515 మందిని పిలవగా 461 మంది హాజరయ్యారు. 54 మంది గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో 296 బీసీ, 56 ఎస్సీ, 78 ఈడబ్ల్యూఎస్, 22 ఎస్టీ, 9 మంది ఓసీ విద్యార్థులు ఉన్నారు. శనివారం 521 మంది విద్యార్థులను పిలిచారు. మొదటి రోజు హాజరు కానివారు సైతం హాజరై సీట్లు పొందవచ్చు. రెండు రోజులు కౌన్సెలింగ్ పూర్తయ్యాక రిజి స్ట్రేషన్ ఆప్షన్ మళ్లీ ఇచ్చి ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
Kargil Vijay Diwas: 25వ కార్గిల్ విజయ్ దివస్.. అమర జవాన్లకు నివాళులర్పించిన మోదీ
మొదటి రోజు కౌన్సెలింగ్ సజావుగా పూర్తయ్యింది. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పత్రాలు పరిశీలించి సీట్లు కేటాయించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
Fertilizer Subsidies: సబ్సిడీపై తక్కువ ధరకు ఎరువులు.. మూడు నెలల్లో రూ.37,000 కోట్ల సబ్సిడీ!
అడ్మిషన్లు కన్వీనర్ డాక్టర్ అమరేంద్రకుమార్, డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజి, ఏఓ మునిరామకృష్ణ, అకడమిక్ డీన్ కె.మోహన్‌కృష్ణ చౌదరి, అడ్మిషన్లు కన్వీనర్ గోవర్దనరావుతో కూడిన అధికారులు కౌన్సెలింగ్‌ను పర్యవేక్షించారు. మిగులు సీట్లకు ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాలు కల్పించనున్నట్లు అధికారులు చెప్పారు. శ్రీకాకుళం క్యాంపస్‌కు ఆప్షన్లు ఇచ్చుకున్న మెరిట్ విద్యార్థులు ఎస్.విద్యశ్రీ, ఎల్.భావన, ఎస్.మానస, జి.షణ్ముకేశ్వర్, డి.రాకేష్‌లకు అడ్మిషన్ ధ్రువీకరణ పత్రాలు అధికారులు అందజేశారు.
JNTUA B. Tech Results : జేఎన్‌టీయూఏ బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల..