UPSC Ranker Anurag Kumar: ఇంటర్‌లో ఫెయిల్ అయినప్పటికీ.. యూపీఎస్‌సీలో ర్యాంకుతో ఐఏఎస్‌గా.. కానీ..!
సాక్షి ఎడ్యుకేషన్: మనం అనుకున్నది సాధించేందుకు ఒక్కోసారి ఒక్క మెట్టు ఎక్కితే సరిపోతుంది. కొన్నిసార్లు ఎన్ని మెట్లు ఎక్కినా కూడా మనకు ఓటమి ఎదురవుతుంది. అటువంటప్పుడే మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉండాలి. తిరిగి, మెట్లు ఎక్కడం ప్రారంభించాలి.
చదువులో కూడా అంతే, ఒక దానిలో మనం అనున్న మార్కులు రాలేదని దిగులుతో ఉంటే ఆ మార్కుల రావు. మన ప్రతిభ, ఆశయం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో కనబరచాలి. ఏది కూడా త్వరగా అవ్వదు. అన్నింటికీ వేచి చూడాల్సిందే. ఇలా, తన చదువులో ఫెయిల్ అయ్యాను అని దిగులు చెంది, అక్కడే ఆగిపోయుంటే ఇప్పుడు ఎందరికో స్పూర్తిగా నిలిచిన ఇతను ఎక్కడ ఉండేవాడంటారు..!
ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి ఒకప్పుడు తన చదువులో మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండేవాడు. ప్రస్తుతం అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎదిగాడు.. బీహార్‌లోని బెట్టియా జిల్లాలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్‌గా ఉన్నారు. అసలు ఇతని ఐఏఎస్ ప్రయాణం ఎక్కడ మొదలైంది? జీవితంలో ఫెయిల్ అయ్యింది ఎక్కడ..? తెలుసుకుందాం..
అనురాగ్ కుమార్.. ఇతను చిన్నతనం నుంచి హిందీ మాధ్యమంలో చదువుకునేవాడు. ఎనిమిదో తరగతి వరకు అక్కడే ఉండగా, ఆ తరువాత ఇంగ్లీష్ మాధ్యమానికి మారాడు. అయితే, తనకు చిన్నప్పటి నుంచి హిందీ స్కూల్లో ఉండి ఇంత తక్కువ సమయంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టమయ్యేది. ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నారు. తన తోటివాళ్లంతా ఇంగ్లీష్‌లో మాట్లాడితే, తన ఆ సమయంలో ఎక్కువ ఇబ్బందులు ఎదురుకునేవాడు. వచ్చి రాని ఇంగ్లీష్‌లో మాట్లాడలేక ఎన్నో సవాళ్లను ఎదురోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ, తనలో నేర్చుకోవాలన్న పట్టుదల ఇంకా పెరిగింది. అలా, తన పదో తరగతిని 90 శాతంతో పూర్తి చేశాడు.
పాఠశాలలో భాషతో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్లాడు. అలాగే, మరో అడుగు వేస్తూ ఇంటర్ జీవితాన్ని ప్రారంభించాడు. తన చదువు బాగానే సాగుతున్న సమయంలో తనకు లెక్కల్లో ఇబ్బందులు కలిగేవి. భాషను ఎదుర్కొని నిలిచాడు, కానీ ఇక్కడ ప్రీ బోర్డు పరీక్షల్లో మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ, వెనకడుగు వేయకుండానే ముందుకు సాగాడు. కష్టపడి ప్రయత్నించాడు, తన పట్టుదలను కోల్పోలేదు. అలా, నేర్చుకొని బోర్డు పరీక్షల్లో నెగ్గాడు.
ఇలా, తన ఇంటర్ చదువుని కూడా ఇబ్బందులను ఎదుర్కుంటూనే పూర్తి చేశాడు. ఏనాడు, ఇది నా వల్ల కాదు నేను ఇది చేయలేను అని అనుకోలేదు. సాధించాలి అన్న కసిమాత్రమే తనను స్కూల్, ఇంటర్ చదువుల్ని పూర్తి చేసేందుకు కారణం అయ్యాయి. అలాగే, తన డిగ్రీ, పీజీ చదువులను కూడా ఇలాగే పూర్తి చేశాడు.
Actress Samantha : ఈ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించిన స్టార్ హీరోయిన్ సమంత.. ఎందుకంటే..?
అయితే, తను పీజీ చదువుతున్న సమయమే తనకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ సమయంలో తనకు వచ్చిన ఆలోచనే యూపీఎస్‌సీ. యూపీఎస్‌సీ చదువాలన్న ఆశ ఏర్పడింది. అందుకోసం రేయిపగలు కష్టపడ్డాడు. తన పాఠశాల జీవితం నుంచి సవాళ్లను ఎదుర్కోవడం అలావాటైపోయింది. ఇక్కడ తను చదివి రాసిన సివిల్స్ పరీక్షలో తనకు 2017లో 677 ర్యాంకు వచ్చింది. అది తనకి తృప్తిని ఇవ్వలేదు. తిరిగి, మళ్లీ పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యాడు. మరో ఏడాది అంటే, 2018లో దేశంలోనే 48వ ర్యాంకును సాధించాడు అనురాగ్. ఇలా, తన జీవితంలో ప్రతీదాంట్లో తనకు ఏదోరకంగా సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా, తన ఏనాడు ఒటమిని అంగీకరించలేదు.
ఈ కథనంతో, మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి.. అదే, జీవితంలో కష్టాలు ఎప్పటికీ ఉంటాయి. ఇబ్బందులు మన వెంటే నడుస్తాయి. కానీ, మనం వాటిని ఎదురుకొని ముందుకు వెళ్లాలి కాని ఆగిపోకూడదు. ప్రస్తుతం, అనురాగ్ కుమార్ ఐఏఎస్ అనురాగ్ కుమార్‌గా ఎదిగి అందిరికీ స్పూర్తిగా నిలిచాడు. ఇతని ప్రయాణం అందరికీ స్పూర్తి..
Tags
- Success Stories
- inspiring success of upsc rankers
- civil services rankers stories
- intermediate pre board failed student anurag kumar
- UPSC Ranker
- Inspiring Journey of IAS Anurag Kumar
- motivation stories for students
- failure to successful persons stories
- UPSC Ranker Anurag Kumar
- IAS Anurag Kumar Success Story
- education of IAS Anurag kumar
- IAS officer journey
- stories of successful and inspiring persons
- Education News
- Sakshi Education News
- latest success stories of inspiring persons
- Failure to Success Stories
- Competitive Exams
- UPSC
- civil services candidates stories
- latest stories of inspiring persons
- sakshieducation success stories