Skip to main content

Government Job Selected Candidate Story : కేవ‌లం ఆరు నెలల్లోనే.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ..

మ‌నం అనుకున్న ల‌క్ష్యం సాధించ‌గ‌ల‌ము అనే న‌మ్మ‌కం.. బలంగా ఉంటే.. ఎలాంటి ల‌క్ష్యానైన ఈజీగానే సాధించ‌గ‌ల‌మ‌ని నిరూపించారు కల్పన‌. ఈమె రాజస్థాన్‌లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన వారు. కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి.
kalpana birda rajasthan   success story of kalpana birda

తల్లి పొలం పనులలు చేస్తూ..
కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్‌లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

☛ GATE 2024 Rankers Success Stories : గేట్-2024లో దుమ్మురేపిన జేఎన్‌టీయూకే విద్యార్థులు.. ఏకంగా 189 మంది ర్యాంక్‌లు కొట్టారిలా..

వ‌రుస‌గా మూడు ఉద్యోగాలు కొట్టానిలా..

kalpana birda si job

రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంత యువతులు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో  మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన దీనికి ఉదాహరణగా నిలిచారు. ఆమె తొలుత సీహెచ్‌ఎస్‌ఎల్‌లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్‌టీలో ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం చేజిక్కించుకుంది.

☛ Actress Samantha : ఈ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించిన స్టార్‌ హీరోయిన్ సమంత.. ఎందుకంటే..?

చదువుతో పాటు ఎప్పటికప్పుడు..

success story

కల్పన మాట్లాడుతూ.. తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది. చదువుతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని, ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని తెలిపింది.

IAS Anuradha Pal Success Story : కోచింగ్ ఫీజుల‌కు డ‌బ్బులు లేక‌.. ట్యూషన్ చెప్పా.. చివ‌రికి ఐఏఎస్ కొట్టానిలా.. కానీ..

Published date : 16 Apr 2024 11:31AM

Photo Stories