Skip to main content

IAS Anuradha Pal Success Story : కోచింగ్ ఫీజుల‌కు డ‌బ్బులు లేక‌.. ట్యూషన్ చెప్పా.. చివ‌రికి ఐఏఎస్ కొట్టానిలా.. కానీ..

యూపీఎస్సీ సివిల్స్ కొట్టడం అనుకున్నంత ఈజీగా కాదు.. దీనికి కృషి, అంకితభావం, పట్టుదలతో ముందుకు సాగితే.. చివ‌రికి అద్భుతమైన విజయాల‌ను సాధించ‌గ‌ల‌రు. కొంతమంది తాము అనుకున్నది సాధించ‌డానికి ఎన్నో క‌ష్టాలు ప‌డుతుంటారు.
anuradha paul ias   anuradha paul civils success story

కానీ వారు త‌మ ల‌క్ష్యాన్ని వదలరు. స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందిన వారు.. ఐఏఎస్‌ అనురాధ పాల్‌. యూపీఎస్సీ సివిల్స్‌ కోచింగ్‌ ఫీజుల‌కు డ‌బ్బులు స‌రిపోక ఎన్నో క‌ష్టాలు ప‌డింది. చివ‌రికి  కొంద‌రు విద్యార్థులకు ట్యూషన్ చెప్పుతూ.. ఆ డ‌బ్బులను స‌మకుర్చుకునేది. ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొని చివ‌రికి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఐఏఎస్‌ అనురాధ పాల్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 

anuradha paul ias details in telugu

అనురాధ పాల్.. హరిద్వార్‌లోని ఒక చిన్న గ్రామం. ఆమె తండ్రి పాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. ఈమె తన చిన్నతనంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఎడ్యుకేష‌న్ :
అనురాధ పాల్ హరిద్వార్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ త‌ర్వాత‌ పంత్ విశ్వ‌విద్యాల‌యంలో బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ఢిల్లీకి మారిన అనురాధ‌.. అక్క‌డ‌ టెక్ మహీంద్రాలో కొంత‌కాలం పని చేశారు. కానీ ఆమెకు తాను చేస్తున్న ప‌నితో సంతృప్తి క‌ల‌గ‌లేదు. తాను సాధించాల‌నుకుంది ఇది కాదు అనిపించింది. అప్పుడే అనురాధ ఐఏఎస్‌ తన నిజమైన గోల్‌ అని గ్రహించారు. వెంట‌నే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

జాబ్ చేస్తూనే.. యూపీఎస్సీ సివిల్స్‌కు..

anuradha paul ias news telugu

అనంత‌రం ఆమె రూర్కీలోని ఒక కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా చేరారు. అక్క‌డ జాబ్ చేస్తూనే యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యారు. అయినా కూడా కోచింగ్ ఫీజుల‌కు డ‌బ్బులు స‌రిపోక‌ ఆమె విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవారు. ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి.. యూపీఎస్సీ సివిల్స్ జాతీయ స్థాయిలో.. 451వ ర్యాంక్ సాధించారు. ఈ విధంగా ఈమె 2012లో తన మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.

కానీ ఈమె ఆ ర్యాంక్‌తో ఐఏఎస్ రాలేదు. క‌లెక్ట‌ర్‌ కావాలనేదే ఈమె క‌ల‌. దాంతో అనురాధ మళ్లీ సివిల్ స‌ర్వీసుల కోసం ప్రిప‌రేష‌న్ ప్రారంభించారు. దాంతో ఆమె 2015లో తన రెండవ ప్రయత్నంలో ఆల్ ఇండియా 62వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ సాధించారు. అనురాధ‌ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లా ‌కలెక్టర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు.

ఎంతో స్ఫూర్తిదాయకమైన విజయగాథ అనురాధ ఐఏఎస్‌ అనురాధ పాల్‌ది. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలో ఆమె రెండుసార్లు విజయం సాధించారు. ఈమె జీవితం నేడు పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే యువ‌త‌కు ఆద‌ర్శం.

Published date : 08 Apr 2024 10:53AM

Photo Stories