Skip to main content

Actress Samantha : ఈ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించిన స్టార్‌ హీరోయిన్ సమంత.. ఎందుకంటే..?

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత ఇంటర్‌ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నిర్మలను కొనియాడింది. ఈ రోజుల్లో తనే నాకు ఆదర్శం అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ పత్రిక క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Actress Samantha and Inter Student Nirmala   Samantha praising Inter student Nirmala from Kurnool district, AP Tollywood star Samantha commending Inter student Nirmala on social media

స్టార్ హీరోయిన్‌ సమంత ఇంటర్‌ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించడంతో సామ్ ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ఆంధ్రప్రదేశ్‌  ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో ఆలూరు కేజీబీవీలో చదివిన ఎస్ నిర్మల బైపీసీలో 440 కి 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది.

బాల్య వివాహం నుంచి తప్పించుకుని..

Inter Student Nirmala

నిర్మల.. బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాదు నిర్మల పదో తరగతిలోనూ 537 మార్కులు సాధించింది. నిరుపేదలైన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది.  ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది.

ఈ కలెక్టర్ చోర‌వ‌తో..

kurnool collector srujana

పేదరికంతో తల్లిదండ్రులు ఈ అమ్మాయి చదువు మాన్పించారు. ఇది తెలిసిన కర్నూలు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. త‌న‌పై కలెక్టర్ పెట్టుకున్న న‌మ్మకంను ఆ అమ్మాయి నిరూపించింది. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూప్‌తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది. ఈ అమ్మాయే నిర్మ‌ల‌. ఈ సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్‌ జి.సృజన.. నిర్మల పోరాట యోధురాలుని, ఆ అమ్మాయి దృఢ సంకల్పం, పోరాట పటిమకు సెల్యూట్‌ అని ప్రశంసించారు.

☛ After Inter Best Courses : ఇంటర్ తర్వాత.. బెస్ట్ కోర్సులు ఇవే..! ఈ కోర్సుల్లో జాయిన్ అయితే..

టెన్త్‌లో మంచి మార్కులు వ‌చ్చిన కూడా.. పేదరికంతో తల్లిదండ్రులు.. 
కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన నిర్మల 10వ తరతగతిలో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికంతో తల్లిదండ్రులు చదువు మాన్పించిన సందర్భంలో కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మలను ఆస్పరి కేజేబీవీలో చేర్పించారు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూప్‌తో మొదటి సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు 421 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా కలెక్టర్‌.. నిర్మలను క్యాంప్‌ కార్యాలయానికి పిలిపించుకొని అభినందించారు. జిల్లాలో బైపీసీ గ్రూప్‌లు ఉన్న 8 కేజీబీవీల్లో నిర్మల టాపర్‌గా నిలవడం అభినందనీయమన్నారు. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన హనుమంతమ్మ, శ్రీనివాస్‌ దంపతుల కుమార్తె నిర్మల గురించి నేడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారన్నారు. ఆడపిల్లలకు నిర్మల రోల్‌మోడల్‌, స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసించారు.

inter student nirmala

ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనప్పటికీ దృఢ సంకల్పంతో చదువుకోవాలన్న తన కోరికను నెరవేర్చుకొని ఉన్నత ఆశయంతో ముందుకు వెళుతోందన్నారు. విద్యతోనే సాధికారత లభిస్తుందని ఆడపిల్లలు చదువుకొని సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. బేటీ బచావో బేటీ పడావో కింద నిర్మలకు ఇన్సెంటివ్‌ ఇవ్వాలని ఇంచార్జ్‌ ఐసీడీఎస్‌ పీడీని కలెక్టర్‌ ఆదేశించారు.

 Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

విద్యార్థిని ఖాతాలో ఇన్సెంటివ్‌ జమ చేయడం వల్ల ఇంటర్‌ తరువాత వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా పై చదువులు చదువుకోడానికి ఉపయోగ పడుతుందన్నారు. సమస్యలతో చదువుకోలేక మధ్యలో చదువు ఆపేసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే స్పెషల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించి అలాంటి వారిని ఈ సంవత్సరం కేవీజీబీల్లో అడ్మిషన్‌ చేయించాలని ఆదేశించారు. నిర్మల సాధించిన ప్రగతి గురించి అందరికి తెలిసేలా సమావేశం నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నిర్మలను శాలువాతో సన్మానించి స్వీట్స్‌ అందజేశారు. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి జీవితంలో అనేక విజయాలు సాధించాలని సూచించారు.

గ్రామంలో ఉన్న జడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదివి 537 మార్కులు సాధించానని, తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలతో చదువు వద్దని పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అయితే తనకు ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లానని నిర్మల తెలిపారు. ఈ విషయం ప్రతికల్లో ప్రచురితమై కలెక్టర్‌ దృష్టికి వెళ్లడం, కలెక్టర్‌ మేడం వెంటనే స్పందించి కేజీబీవీలో అడ్మిషన్‌ ఇప్పించారన్నారు. ఈ రోజు ఇంటర్‌ బైపీసీ మొదటి సంవత్సరం పరీక్షల్లో కేజీబీవీల్లో టాపర్‌గా నిలవడం ఆనందంగా ఉందన్నారు.

ఐపీఎస్‌ అధికారి కావాలనే ఆమె కలను..

praveen prakash

ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్‌ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ఎస్‌ఎస్‌సీలో 537 మార్కులు సాధించడం గమనార్హం.

నిరుపేదలైన ఆమె తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్న పట్టుదలతో పోరాడి బాల్య వివాహం నుంచి తప్పించుకుంది.  ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. నిర్మల స‌క్సెస్ జ‌ర్నీ నేటి యువ‌త‌కు ఎంతో స్ఫూర్తినిస్తుంది.

చ‌ద‌వండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!

Published date : 15 Apr 2024 05:17PM

Photo Stories