Intermediate News: ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులు నవంబర్ 11వ తేదీ లోపు ఫీజు చెల్లించాలి
చిత్తూరు : జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులు నవంబర్ 11వ తేదీ లోపు సంబంధిత కళాశాలల్లో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించాలని డీవీఈఓ సయ్యద్ మౌలా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్, ప్రైవేట్, హాజరు మినహాయింపు పొందిన విద్యార్థులు ఈ నెల 21వ తేదీ నుంచి నవంబర్ 11 లోపు ఫీజు చెల్లించాలన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో చెల్లించడానికి నవంబర్ 20 వరకు అవకాశం ఉంటుందన్నారు. ఆర్ట్స్, హ్యూమానిటీస్ విద్యార్థులు https:// biev2.biev2.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నవంబర్ 15 లోగా హాజరు మినహాయింపు కోసం రూ.1500 ఫీజు చెల్లించాలని డీవీఈఓ వెల్లడించారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు RBI బంపర్ ఆఫర్ ప్రతి నెల 20వేల రూపాయలు
Tags
- Intermediate Fee on Nov 11th.
- AP Intermediate 2024 News
- AP Intermediate Fee 2025
- sakshieducation latest news
- AP Intermediate exams News
- Intermediate Annual exams2025 Fee
- Latest News
- Chittoor
- InterExamFee
- DVEOAnnouncement
- NovemberDeadline
- IntermediateColleges
- PublicExaminations
- EducationUpdates
- FirstYearStudents
- FeePayment
- SakshiEducationUpdates