Skip to main content

Inter Exams 2025: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్‌ విడుదల

సాక్షి: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి షెడ్యూల్‌ విడుదల చేసింది.
Intermediate Board released inter examination fees schedule  Intermediate exam fee payment schedule announced for March 2025 exam

మార్చి–2025లో పరీక్షలు రాయనున్న మొదటి రెండో సంవత్సరం విద్యార్థులు ఈనెల 21 నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని ఏపీ ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. 

రూ.1000 ఆలస్య రుసుంతో నవంబర్‌ 20వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. ఈ గడువు తర్వాత అవకాశం ఉండదని అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్‌కు సూచించామని తెలిపారు.

15 వరకు ప్రైవేటు విద్యార్థుల ఎన్‌రోల్‌ 
ఇంటర్‌ పరీక్షలు ప్రైవేటుగా రాయదలచిన వి­ద్యార్థులకు అటెండెన్స్‌ మినహాయింపుని­చ్చా­­రు. ఇందుకోసం వచ్చే నెల 15వ తేదీ వరకు రూ.1500, రూ.500 పెనాల్టీతో నవంబర్‌ 30 వరకు ఫీజు చెల్లించవచ్చు.

JEE Main 2025: జేఈఈ మెయిన్‌లో ఛాయిస్‌ ఎత్తివేత

ప్రైవేటుగా పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు పదో తరగతి పా­సై ఏడాది పూర్తయిన వారు ఇంటర్‌ మొదటి సంవత్సరం, రెండేళ్లు దాటిన వారు రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు కావొచ్చు.

Published date : 18 Oct 2024 12:36PM

Photo Stories