Skip to main content

Distance Education: దూరవిద్య ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు

కేయూ క్యాంపస్‌ : కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌, ఓరియంటేషన్‌ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు గడువు పొడిగించినట్లు దూరవిద్య కేంద్రం (ఎస్‌డీఎల్‌సీఈ) డైరెక్టర్‌ వల్లూరి రామచంద్రం మంగళవారం తెలిపారు. ఈనెల 15వతేదీతో గడువు ముగియడంతో పెంపుదల చేసినట్లు వెల్లడించారు.
Distance Education distance education admissions in kakatiyauniversity

అభ్యర్థులు ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చుని వివరించారు. మొత్తం 33 కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నామన్నారు. డిగ్రీలో బీఏ, బీకాం, జనరల్‌ కంప్యూటర్స్‌, బీబీఏ, బీఎస్సీ, బీఎల్‌, బీఎస్సీ, ఎం.ఏ తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, హిస్టరీ, రూరల్‌ డెవలప్‌మెంట్‌, సోషియాలజీ, హెచ్‌ ఆర్‌ఎం, ఎం.కామ్‌, సోషల్‌ వర్క్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఎమ్మెస్సీ సైకాలజీ, గణితశాస్త్రం, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, వృక్ష, జంతు శాస్త్రాలు, ఎంఎల్‌ఐఎస్సీ ఉన్నాయని తెలిపారు.

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

అలాగే, డిప్లొమా కోర్సుల్లో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, గైడ్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌, యోగా, సర్టిఫికెట్‌ కోర్సులో సీఎల్‌ఐఎస్సీ, మిమిక్రీలో ఓరియంటేషన్‌ కోర్సుల్లోనూ ప్రవేశాలు పొందొచ్చన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు, ఫొటో జత చేసి కోర్సు రుసుం ఆన్‌లైన్‌లో కాని దూర విద్య కేంద్రం ఎస్‌బీఐ ఎక్స్‌ టెన్షన్‌ కౌంటర్‌ నుంచి చలాన్‌ ద్వారా కాని చెల్లించొచ్చన్నారు. కోర్సులు, ఫీజులు వివరాలకు 0870–24611480,2461490 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

 

Published date : 16 Oct 2024 05:47PM

Photo Stories