10th & Inter Fee Schedule: టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల చేసింది. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి-2025 హాజరగుటకు గాను, పరీక్ష ఫీజు డిసెంబర్ 23 నుండి జనవరి 10 వరకు, అభ్యాసకులు ఏదేని APONLINE సేవా కేంద్రము లేదా ONLINE PAYMENT GATEWAY ద్వారా గాని నేరుగా చెల్లించ వచ్చును.
ఫీజు చెల్లింపు తేదీలు
అపరాధ రుసుము లేకుండా: 23.12.2024 నుండి 31.12.2024
రూ. 25 అపరాధ రుసుముతో: 01.01.2025 నుండి 04.01.2025 రుసుము + రూ. 25
రూ. 50 అపరాధ రుసుముతో: 05.01.2025 నుండి 08.01.2025 రుసుము + రూ. 50
తత్కాల్: 09.01.2025 నుండి 10.01.2025
- ఇంటర్మీడియట్: రూ. 1000
- పదవ తరగతి (SSC): రూ. 500
పరీక్ష ఫీజు చెల్లింపు:
APONLINE సేవా కేంద్రాలు లేదా
పేమెంట్ గేట్వే (ఆన్‌లైన్ పద్ధతి) ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
చదవండి: Intermediate Exams: ఇంటర్ ప్రశ్నాపత్రాలకు ఆన్‌లైన్ రక్షణ ....నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
ఫీజు చెల్లించుటకు అర్హతలు
కనీస వయస్సు:
యస్.యస్.సి: 14 ఏళ్లు పూర్తి (31.08.2024 నాటికి).
ఇంటర్మీడియట్: 15 ఏళ్లు పూర్తి.
గత విద్యా సంవత్సరాల్లో ప్రవేశం పొంది పరీక్షకు హాజరై, అనర్హతగా నిలబడిన వారు.
గత విద్యా సంవత్సరాల్లో ప్రవేశం పొంది ఇప్పటి వరకు పరీక్షకు హాజరు కాకపోయిన వారు.
ముఖ్యమైన సూచనలు
- ఫీజు రసీదులో సబ్జెక్టుల వివరాలు పరిశీలించాలి. సరైన సబ్జెక్టులకు మాత్రమే ఫీజు చెల్లించాలి.
- ఒకసారి చెల్లించిన ఫీజు వాపసు ఇవ్వబడదు.
- చెల్లించిన సబ్జెక్టులకు మాత్రమే పరీక్షకు అనుమతించబడుతుంది.
- దివ్యాంగులకు మినహాయింపు: పరీక్ష ఫీజు నుంచి మినహాయించబడినప్పటికీ, రిజిస్ట్రేషన్ చేయాలి.
Published date : 25 Dec 2024 02:39PM
Tags
- 10th Class 2025 Exam Fees Schedule Released
- Inter 2025 Exam Fees Schedule Released
- AP Open School Society
- APOSS
- Open Tenth Class
- Open Inter
- andhra pradesh news
- AP SSC Exam Fee
- AP Inter Exam Fee Schedule
- Aponline payment gateway
- Public exam feepayment
- AP education board updates
- Examfeepaymentdeadline
- APSSC and interexams updates
- sakshieducation updates