UPSC Exam 2024 : ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షకు అభ్యర్థుల హాజరు శాతం!
తిరుపతి: యూపీఎస్సీ పరీక్షలకు 55 శాతం మంది హాజరయ్యారని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. యూపీఎస్సీ కంబైనన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షలకు ఉదయం పేపర్–1కు 55.71 శాతం, మధ్యాహ్నం పేపర్–2కు 55.80 శాతం మంది హాజరయ్యాయని వెల్లడించారు.
Posts at Indian Air Force : భారత వైమానిక దళంలో చేరేందుకు దరఖాస్తులు..
ఈ రెండు రెండు సెషన్లలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. 1,199 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్–1కు 668 మంది, మధ్యాహ్నం పేపర్–2కు 669 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుంచి బందోబస్తు నడుమ సంబంధిత పరీక్ష కేంద్రాలకు తరలించామని, అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలియజేశారు.
Tags
- UPSC 2024
- Exam
- competitive exam
- Candidates presence
- two papers mode
- collector venkateshwar
- exam centers
- UPSC Combined Medical Services Exam
- two sessions exam
- Education News
- Sakshi Education News
- TirupatiUpdates
- UPSCExams
- MedicalServices
- GovernmentOfficials
- ExamStatistics
- CivilServices
- PublicAdministration
- GovernmentUpdates
- SakshiEducationUpdates