UPSC Civils 18th Ranker Wardah Khan : లక్షల్లో వచ్చే జీతాన్ని వదిలి.. లక్ష్యం కోసం వచ్చి సివిల్స్ కొట్టానిలా.. అతి చిన్న వయస్సులోనే..
కుటుంబ నేపథ్యం :
వార్ధా ఖాన్.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్‌కు చెందిన వారు. ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోగా ప్రస్తుతం తల్లితో కలసి ఉంటోంది.
ఎడ్యుకేషన్ :
ఢిల్లీలోని ఖల్సా కాలేజీ నుంచి వార్ధా ఖాన్ బీకామ్ హానర్స్ పూర్తి చేసింది. చదువు తరువాత ఎనిమిది నెలల పాటు కార్పొరేట్ కంపెనీలో పని చేసింది. అది సంతృప్తి నివ్వలేదు. పైగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం. దీంతో కష్టపడి చదవి తమ కలను సాకారం చేసుకుంది.
లక్షల జీతాన్ని వదిలి.. లక్ష్యం కోసం..
వార్ధా ఖాన్.. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టేసింది. పట్టుదలతో చదివి ఎవరు ఊహించని ర్యాంక్ సాధించింది. తాజా యూపీఎస్‌సీ ఫలితాల్లో టాప్-20లో ర్యాంకు సాధించింది. వార్ధా ఖాన్ వయస్సు కేవలం 24 ఏళ్లే.
నా తొలి ప్రాదాన్యత దీనికే..
ప్రతిష్టాత్మక పరీక్ష సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే అంత ఈజీకాదు. దీనికి ఎంతో పట్టుదల కృషి కావాలి. తన తొలి ప్రాదాన్యత ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అని తెలిపింది. ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. సివిల్స్‌లో ర్యాంక్ కొట్టడం తన టార్గెట్ అన్నారు. కానీ టాప్ 20లో ఉంటానని అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది వార్దా ఖాన్.
దీంతో తన ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.
☛ IAS Officer Success Story : ఈ మైండ్ సెట్‌తోనే.. ఐఏఎస్.. ఐపీఎస్ కొట్టానిలా.. కానీ..
ఈ సబ్జెక్టులు అంటే నాకు ఇష్టం..
హిస్టరీ, జియోపాలిటిక్స్ సబ్జెక్టులు అంటే నాకు ఇష్టమన్నారు. అలాగే కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో, MUN లలో (మాక్ యునైటెడ్ నేషన్స్) పాల్గొనేదాన్ని. ఆ సమయంలో సివిల్స్ సాధించాలనే ఆలోచన తనలో కలిగిందని చెప్పుకొచ్చింది.
వాస్తవానికి సివిల్స్ కోసం 2021 నుంచి సిద్ధమవుతున్నాననీ, రెండో ప్రయత్నంలో విజయం సాధించానని వెల్లడించింది. ఈ సందర్బంగా వార్దా ఖాన్ తన కుటుంబం సభ్యులకు, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మరణం.. మరో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివరికి..
Tags
- Wardah Khan upsc civils 2023 Ranker
- Wardah Khan
- UPSC Civils Ranker Wardah Khan
- UPSC Civils Ranker Wardah Khan Success Story in Telugu
- UPSC 18th Civils Ranker Wardah Khan
- UPSC Civils Ranker Wardah Khan Family
- UPSC Civils Ranker Wardah Khan Education
- UPSC Civils Ranker Wardah Khan Details
- UPSC Civils Ranker Wardah Khan Family Real Life Story
- UPSC AIR 18 Wardah Khan Story in Telugu
- UPSC Civils 2023 AIR 18 Wardah Khan Success Story