Skip to main content

Venkata Naga Sai Manasvi Scored 599/600 Marks : ఏపీ టెన్త్ ఫ‌లితాల్లో ఈ విద్యార్థికి 599/600 మార్కులు వ‌చ్చాయ్‌.. ఎలా అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది ఏపీ టెన్త్ ఫ‌లితాల్లో బాలిక‌లు స‌త్తాచాటారు. ఈ ఫ‌లితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 2803 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఈ టెన్త్ ఫ‌లితాల్లో ఎన్నో రికార్డులు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరం టెన్త్‌ పత్రాల మూల్యాంకనం రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేశారు.
Akula Venkata Naga Sai Manasvi  AP Tenth Results Records   AKULA VENKATA NAGA SAI MANASWI   Girls Excel in AP Tenth Results

అలాగే దారుణంగా 17 స్కూల్స్‌లో ఒక్క విద్యార్థి అంటే.. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. 17 స్కూల్స్‌లో 0% ఉత్త‌ర్ణ‌త శాతం వ‌చ్చింది. అయితే ట్విస్ట్ ఏమంటంటే.. ఈ 17 స్కూల్స్‌లో కేవ‌లం ఒక్క స్కూల్స్ మాత్ర‌మే ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉంది. మిగిలిన 16 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి.

☛ After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఎవ‌రు ఊహించ‌ని విధం 599/600 మార్కులతో..

Akula Venkata Naga Sai Manasvi scored 599 marks out of total 600 marks in the 10th class


కానీ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ... ఏలూరుకు చెందిన ఆకుల వెంక‌ట నాగ‌సాయి మ‌న‌స్వి (AKULA VENKATA NAGA SAI MANASWI) ఎవ‌రు ఊహించ‌ని విధంగా 600 మార్కుల‌కు 599 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసి.. స్టేట్ టాప‌ర్‌గా నిలిచింది. వీళ్ల నాన్న పేరు ఆకుల నాగ వ‌ర‌ప్ర‌సాద్ రావు (AKULA NAGA VARA PRASADA RAO). ఆకుల వెంక‌ట నాగ‌సాయి మ‌న‌స్వి టెన్త్‌లో సెకండ్ లాంగ్వేజ్‌లో మాత్రం 99 మార్కులు సాధించింది. మిగిలిన అన్ని స‌బ్జెక్ట్‌ల‌లో 100కి 100 మార్కులు సాధించింది.

 Best Career Options After 10th Class: పది తర్వాత.. కోర్సులు, కెరీర్‌ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి !

ఆకుల వెంక‌ట నాగ‌సాయి మ‌న‌స్వి ప‌దో త‌ర‌గ‌తి మార్కుల వివ‌రాలు ఇవే..

Akula Venkata Naga Sai Manasvi scored 599 marks out of total 600 marks details in telugu

ఏపీలో టెన్త్‌ క్లాస్‌ ఫలితాలు వచ్చాయి. టెన్త్‌లో స్టేట్‌ టాపర్‌ ఓ అమ్మాయి. పేరు... వెంకట నాగసాయి మనస్వి. ఎన్ని మార్కులొచ్చాయంటే... వందకు వంద. వందకు వంద. ఇలా ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఐదు సబ్జెక్టుల్లో వందకు వంద. హిందీలో మాత్రం ఒకటి తగ్గించుకుంది. మొత్తంగా 600కి 599 మార్కులు!! పేపర్‌లు దిద్దే టీచర్లకే ఓ పరీక్ష.

ఇన్ని మార్కులు తెచ్చుకోవడంతో..
ఆకుల వెంకట నాగసాయి మనస్విది ఏలూరు జిల్లా, నూజివీడు పట్టణం. ఈ అమ్మాయి పదోతరగతిలో రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించింది. ఏటా ఎవరో ఒకరు ఈ రికార్డు సాధిస్తారు. కానీ ఇన్ని మార్కులు తెచ్చుకోవడం ఆమె సాధించిన మరో రికార్డు. 600కి ఒక్క మార్కు తక్కువగా 599 మార్కులతో ఉత్తీర్ణత సాధించడం పదవ తరగతి పరీక్షలకు కూడా రికార్డే.  
 
నా హీరో..

ఆకుల వెంకట నాగ సాయి మనస్వి, టెన్త్‌ క్లాస్‌ స్టేట్‌ టాపర్, ఆంధ్రప్రదేశ్‌.

చదువుకోవడమే జీవిత లక్ష్యం అన్నట్లు చదువుకుంటున్న మనస్వి నేపథ్యం కూడా పుస్తకాలమయమే. ఆమె తల్లి నాగ శైలజ, తండ్రి నాగ వరప్రసాదరావు ఇద్దరూ గవర్నమెంట్‌ స్కూల్‌ టీచర్‌లు. వెంకట నాగ సాయి మనస్వి వారి ఏకైక సంతానం. మనస్వికి క్లాసు పుస్తకాలు చదవడమే కాకుండా మంచి రీడింగ్‌ హ్యాబిట్‌ కూడా ఉంది. అయితే హాబీగా చదివే పుస్తకాలు కూడా కాలక్షేపం కోసం అన్నట్లు ఉండవు, మంచి సబ్జెక్టు ఉన్నవే కావడం విశేషం.

నాకు ఇష్ట‌మైన‌వి..
సిలబస్‌ ద్వారా తెలుసుకున్న విషయాలకు మరికొంత సమాచారాన్ని అందించేవిగా ఉంటాయి. నా రోల్‌ మోడల్‌ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌. స్పోర్ట్స్‌లో క్రికెట్‌ అంటే క్రేజ్‌. కానీ ఆడడానికి సమయం ఉండదు. మ్యాచ్‌ వస్తుంటే వీలయినంత సేపు చూస్తాను. విరాట్‌ కోహ్లీ ఆట నచ్చుతుంది. సినిమాలు చూస్తాను కానీ చాలా తక్కువ. నాకు నచ్చే హీరో రామ్‌ చరణ్‌. అందరికంటే ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా నాన్న.

ఎప్పుడూ ఖాళీగా..
మా నాన్న కంటే బెస్ట్‌ హీరో మరెవరూ ఉండరు. ఆయన ఎప్పుడూ ఖాళీగా ఉండరు. నాన్న పాతికేళ్ల కిందట డీఎస్సీ రాశారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దాంతో ట్యూషన్‌లు చెప్పారు. వ్యవసాయం చేశారు. గత ఏడాది గవర్నమెంట్‌ చేసిన రిక్రూట్‌మెంట్‌లో నాన్నకు ఉద్యోగం వచ్చింది. తన చదువుకు తగిన ఉద్యోగం వచ్చే వరకు ఆయన నిరాశపడకుండా ఎదురుచూశారు అని సంతోషంగా చెప్పింది మనస్విని.

ఇంతలో వాళ్ల తల్లి మాట్లాడుతూ ‘‘మనస్వి చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. పదవ తరగతిలో చాలా కష్టపడింది. ఇక చాలు నిద్రపొమ్మని చెప్పినా వినేది కాదు. అర్ధరాత్రి వరకు చదువుతూనే ఉండేది. సిలబస్‌ పూర్తికాకపోతే తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి చదువుకునేది. మంచి మార్కులు వస్తాయనుకున్నాం. కానీ ఇన్ని మార్కులు తెచ్చుకుంటుందని, రికార్డు సాధిస్తుందని ఊహించ లేదు. తల్లిదండ్రులుగా మాకు ఇంతకంటే సంతోషం మరి ఏముంటుంది’’ అని ఆనందం వ్యక్తం చేశారామె. అత్యధిక మార్కుల సాధనలో మనస్వి రికార్డును భవిష్యత్తులో మరొకరు బ్రేక్‌ చేయడం అంత సులువు కాకపోవచ్చు. మనస్వి మార్కుల రికార్డు ఎప్పటికీ ఆమెకే ఉండిపోవచ్చు కూడా.  

☛ ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు-2024 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

టెక్ట్స్‌ బుక్‌ చదివాను ఇలా..
టెన్త్‌ క్లాస్‌ మార్కుల లిస్ట్‌ మనకు జీవితమంతా తోడు ఉంటుంది. డేట్‌ ఆఫ్‌ బర్త్‌ కోసం మాత్రమే కాదు మనకు చదువు మీద ఉండే ఇష్టానికి ప్రతిబింబం. అందుకే అంత ఎక్కువ కష్టపడ్డాను. మా అమ్మానాన్న నా కోసం తీసుకుంటున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. వారికి నేనివ్వగలిగిన గొప్ప బహుమతి మంచి మార్కులే. పరీక్షలకు ప్రిపరేషన్‌లో నేను గైడ్‌లు, నోట్స్‌ కంటే ఎక్కువగా టెక్ట్స్‌బుక్స్‌ చదివేదానిని. టాపర్‌ అనే లక్ష్యాన్ని పెట్టుకోలేదు. కానీ మంచి మార్కులు రావాలని కష్టపడ్డాను. మొత్తానికి నేను కోరుకున్నదానికంటే మించిన ఫలితాన్ని అందుకున్నాను. సంతోషంగా ఉంది. నాకు మ్యాథ్స్‌ ఇష్టం. ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేసి జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలనేది నా లక్ష్యం.  

Published date : 23 Apr 2024 11:06AM

Photo Stories