Skip to main content

AP 10th Class Student Inspire Story : ఈ టెన్త్ క్లాసు అమ్మాయి 3 రోజులు స్కూల్స్‌కి.. 3 రోజులు కూలికి.. రోజు పని చేస్తే ఫుడ్‌.. కానీ టెన్త్‌లో మార్కులు మాత్రం..

ఇటీవ‌లే ఏపీలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఎంతో మంది పేదింటి బిడ్డ‌లు త‌మ స‌త్తాచాటారు. ఆర్థికంగా పేద‌వారు కావ‌చ్చుఏమో కానీ.. చ‌దువులో ధ‌న‌వంతుల‌మ‌ని నిరూపించిచారు ఎంద‌రో పేదింటి బిడ్డ‌లు. గతంలో ఎన్నడూ లేనంతగా చాలా మంది విద్యార్థులు టాప్‌ స్కోర్‌ చేశారు.
AP 10th Class Student Naveena Inspire Story  Celebrating Excellence Boya Navina Sets New Benchmark in AP Class 10 Board Exams

రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 86.69శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఫలితాల్లో ఎక్కువగా బాలికలు పైచేయి సాధించారు. బాలురి ఉత్తీర్ణత శాతం 84.21శాతం నమోదు కాగా, బాలికలు 89.17% ఉత్తీర్ణత సాధించారు

ప‌నిచేసుకుంటూ చ‌దివే వాళ్లు..
పేద‌రికం.. ఆర్థిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో.. జీవితం అందరికీ సులభంగా ఉండదు. కొంత మందికి అంత కష్టపడకుండానే అన్ని దొరుకుతాయి. కానీ కొంత మంది మాత్రం చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. వాళ్లకి ఏది అంత ఈజీగా రాదు. కనీస అవసరాలకు కూడా చాలా మంది కష్టాలు పడుతున్నారు. చదువు.. ఇది ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం. కానీ చదువుకోడానికి కూడా ఇప్పటి కాలంలో కూడా ఇంకా కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని వాళ్ళు తమకి కష్టాలు ఉన్నంత మాత్రాన చదువుని నిర్లక్ష్యం చేయట్లేదు. ఒకపక్క పనులు చేస్తూనే, మరొక పక్క చదువుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే జీవితంలో సాధించాలి అనే తపన ఉన్న వ్యక్తులు మన మధ్యలో కూడా ఎంత మంది ఉన్నారు అనే విషయం అర్థం అవుతుంది. నిజంగా ఒక మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు అనే విషయం గుర్తొస్తూ ఉంటుంది. 

☛ After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఒక్కరోజు పని చేస్తే తప్ప ఆరోజు..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కర్నూలు జిల్లా, చిప్పగిరి మండలం, బంటనహాలు గ్రామానికి చెందిన బోయ నవీన.. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 509 మార్కులు సాధించింది. నవీన తల్లిదండ్రులు బోయ ఆంజనేయులు, వన్నూరమ్మల. నవీన తండ్రి ఒక వ్యవసాయ కూలీ. నవీన తల్లికి కిడ్నీ వ్యాధి ఉంది. ఒక్కరోజు పని చేస్తే తప్ప ఆరోజు కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉండడంతో, నవీన కూడా కుటుంబ బాధ్యతని తీసుకుంది. చిన్న వయసులోనే తన కుటుంబ బాధ్యతని తన భుజాలపై మోస్తూ, చదువుకుంది. మూడు రోజులు కూలీకి వెళ్ళేది. మరొక మూడు రోజులు స్కూల్‌కి వెళ్లి చదువుకునేది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో నవీన చదివేది.

☛ Venkata Naga Sai Manasvi Scored 599/600 Marks : ఏపీ టెన్త్ ఫ‌లితాల్లో ఈ విద్యార్థికి 599/600 మార్కులు వ‌చ్చాయ్‌.. ఎలా అంటే..?

ప్రతిభ, నమ్మకం ఉంటే.. 
నవీన ప్రతిభని పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించారు. నవీన చదువుకోవడానికి కావాల్సినవన్నీ కూడా అందించారు. దాంతో నవీన కష్టపడి చదువుకొని పదవ తరగతిలో మంచి మార్కులు సాధించింది. ఏదైనా ఒక పని చేయాలి అనే సంకల్పం ఉన్న మనిషి ఏ పని అయినా చేయగలడు అనే మాటకి నిదర్శనంగా నిలిచింది. మనిషి తన కలని సాకారం చేసుకోవడానికి కుటుంబ నేపథ్యం.. అవన్నీ కూడా అవసరం లేదు కేవలం ప్రతిభ, నమ్మకం ఉంటే చాలు అనే విషయాన్ని నిరూపించింది. న‌వీన జీవితం విద్యార్థుల‌కు ఎంతో స్ఫూర్తినిస్తుంది.

 Best Career Options After 10th Class: పది తర్వాత.. కోర్సులు, కెరీర్‌ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి !

Published date : 24 Apr 2024 03:26PM

Photo Stories