Aishwarya : పదో తరగతి విద్యార్థిని కథల పోటీల్లో ప్రతిభ
Sakshi Education
ప్యాపిలి: రాచర్ల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని ఐశ్వర్య కథల పోటీల్లో ప్రతిభ చాటుతోంది. రాచర్ల గ్రామానికి చెందిన భాస్కరయ్య ఆచారి, రమాదేవిల కుమార్తె ఐశ్వర్య గతంలో ఇక్కడ పని చేసిన హెచ్‌ఎం తొగట సురేశ్ బాబు ప్రోత్సాహంతో ఎనిమిదో తరగతి నుంచే కథలు రాయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు పదుల సంఖ్యలో కథలు రాసింది. వాటిలో ‘జలమా..గరళమా’ కథను తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాచిరాజు బాలసాహిత్య పీఠం నిర్వహించిన కథల పోటీలకు పంపించారు. ఈ కథను బహుమతికి ఎంపిక చేసిన నిర్వాహకులు ఈ నెల మూడో తేదీన హైదరాబాదు రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఐశ్వర్యకు నగదు బహుమతి, పుస్తక బహుమానం, జ్ఞాపికతో సత్కరించారు. మరిన్ని మంచి కథలు రాసి అందరి మన్ననలు పొందడమే తన ధ్యేయమని ఐశ్వర్య తెలిపింది.
ఇదీ చదవండి: అంకగణితంలో అంతర్జాతీయ స్థాయి ప్రతిభ చూపిన ఎ.జోషిత
Published date : 15 Nov 2024 12:03PM