IPS Manoj Kumar Sharma: చదువు అబ్బలేదు.. నాలుగో ప్రయత్నంలో ఐపీఎస్‌గా గెలుపు.. ఆయన్నే ఆదర్శంగా..!
ఐపీఎస్ అయ్యేందుకు తను చేసిన మూడు ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.. కానీ, తన పట్టుదల ఓర్పు తనని నాలుగో ప్రయత్నంలో ఫలించేలా చేశాయి. ఒక మామూలు మనోజ్ కుమార్ శర్మకు పోలీస్ అవ్వడం అనేది తన చిన్నప్పటి కల అయినా, తన కుటుంబానికి ఉన్న పేదరిక కష్టాల వలన తన జీవితాన్ని కష్టాల్లోనే ఊహించుకున్న వ్యక్తి ఇతను.. ప్రస్తుతం, ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మగా మారి అడిషనల్ కమిషనర్ ఆఫ్ ముంబాయి పోలీస్ స్థానంలో చేరేంత ఇత్తుకు ఎదిగారు. ఇతని కథేంటో ఈ క్రింది కథనంలో తెలుసుకుందాం..
IIT Placement 2024: రూ.కోటి కంటే ఎక్కువ జీతం.. 85 మంది సెలెక్ట్.. ఈ జాబ్స్ ఎక్కడంటే..!
ఆపని ప్రయత్నాలు, వెంట ఉన్న తోడుతోపాటు చుట్టూ అందరూ అందిస్తున్న ప్రోత్సాహంతో తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. మనోజ్ మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లా, బిల్గ్రామ్ గ్రమానికి చెందిన వారు. ఇతకి చిన్నతనం నుంచి పోలీస్ అవ్వాలనేది కోరిక కానీ చదువు పెద్దగా అబ్బేది కాదు. ఒక మామూలు విద్యార్థిగా ఉండేవాడు. తన పాఠశాలలో వారి ప్రిన్సిపాళ్ళు, టీచర్లే వారి చేత పరీక్షకు కాపీ చేయించేవారు. ఈ రకంగా అక్కడి విద్యార్థులంతా పాస్ అయ్యేవారు.
IPS Officer Real Story : మా నాన్న కోసం ఐపీఎస్ కొట్టానిలా.. కానీ.. నా లక్ష్యం మాత్రం ఇదే..
డీఎస్పి దుష్యంత్ ఇన్స్పిరేషన్ తో
ఒకరోజు పాఠశాలలో పోలీసుల తనిఖీలు జరగడంతో అక్కడ విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారో అర్థమైంది. అందులో ఒక పోలీస్ పేరు దుష్యంత్. ఒకరోజు తనని 'నేను కూడా మీలా అవ్వాలంటే ఏం చేయాలి' అని అడిగాడు మనోజ్..
అందుకు సమాధానంగా ఒకే మాట చెప్పాడు ఆ పోలీస్.. 'మోసం చేయవద్దు... కాపీ కొట్టడం ఆపేయాలి' అని అనడంతో ఆ క్షణం నుంచి చదవడం ప్రారంభించారు. ఆపై జరిగిన ప్రతీ పరీక్షలోనూ తనొక్కడే చదివి పరీక్ష రాసేవాడు.
UPSC వైపు
ఆ తరువాత, మనోజ్ తన పోలీస్ కలను సాకారం చేసుకునేందుకు ఢిల్లీకి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పుడే, తన నానమ్మ తనకు పెన్షన్ డబ్బులను ఇచ్చి ఢిల్లీకి పంపింది. అక్కడ తన ప్రయాణ సమయంలోనే డబ్బులను ఎవరో దొంగలించగా తన కష్టాలు మొదలయ్యాయి. అప్పుడు పరిచయం అయినవాడు అనురాగ్ పాఠక్.. ఇతని సహకారంతోనే తను యూపీఎస్‌సీ రాయాలనే ఆశ మరింత పెరిగింది. తను చేసిన ఏ ప్రయత్నాలకు ఫలితం దక్కకపోవడంతో తిరిగి తన ఊరికి వెళ్ళిపోయాడు.
అక్కడ తనకి పెద్ద షాక్‌తోపాటు ఒక ప్రోత్సాహం కూడా దక్కింది. తన నానమ్మ చనిపోయిందన్న వార్త విన్న మనోజ్, దుఃఖంతో కృంగిపోయినప్పటికీ, అధైర్య పడకుండా ఈసారి ఎలాగైనా అనుకున్నది సాధించిన తరువాతే తిరిగి ఇంటికి రావాలని నిర్ణయించుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని సరికొత్తగా ప్రారంభించారు. తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో తిరిగి ప్రిలిమ్స్‌కు సిద్ధపడి పరీక్ష రాసాడు. మెయిన్స్‌కు అర్హత దక్కించుకున్నాడు.
Success Story : సామాన్యుడు కాదు.. ఏకంగా రూ.కోటి జీతం కొట్టాడిలా.. కానీ..
నాలుగో ప్రయత్నం
కానీ, మెయిన్స్‌లో రాణించలేకపోయాడు. అక్కడా వెనకడుగు వేయకుండానే మరో ప్రయత్నానికి ముందుకు సాగాడు. తన మిత్రుల ప్రోత్సాహంతో మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్ష రాసాడు, మెయిన్స్‌కు ఎంపికైయ్యాడు. మెయిన్స్ పరీక్షకు కోచింగ్ తీసుకోవాలని ఒక కోచింగ్ సెంటర్‌కు వెళ్ళగా అక్కడ వారు ఎక్కవ డబ్బులనే ఆశిస్తారనేది అర్థం అయ్యింది.
అక్కడే తనకు పరిచయమైంది శ్రద్ధ.. తనూ పీసీఎస్ కోసం ప్రిలిమ్స్‌కు పరీక్ష రాసేందుకు కోచింగ్‌కు ప్రయత్నిస్తోందని తెలిసి తనకు సహాయపడగలను అని మాటిచ్చాడు. అలా, మనోజ్ శ్రద్ధ ఒకరికొకరు వారి చదువులో సహాయపడ్డారు.
మనోజ్‌కు తన మెయిన్స్ పరీక్షలో దొరికిన ప్రోత్సాహంతో తను చేస్తున్న పిండి పనిని మానుకొని తన స్నేహితుల సహకారంతో పరీక్షకు సిద్ధమైయ్యారు. అలా, మెయిన్స్‌ను నాలుగో ప్రయత్నంలో విజయవంతంగా పూర్తి చేసి ఇంటర్య్వూకు మొదటిసారి ఎంపికైయ్యారు మనోజ్. అప్పుడే తను ప్రేమించిన శ్రద్ధ కూడా పీసీఎస్ కు ఎంపికై డెప్యుటి కమిషనర్‌గా గెలుపొందింది. ఇది తనకు మరో ప్రోత్సాహంలా నిలిచింది.
ఇక, మనోజ్‌కు తన స్నేహితుల నుంచి, తన గురువుల నుంచి లభించిన ప్రోత్సాహంతో సిద్దపడి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అక్కడ తన తెలివితో తన మాటలతో గెలిచి, చివరికి ఐపీఎస్‌కు అర్హత సాధించారు. మొత్తానికి తను చేసిన నాలుగో ప్రయత్నంతో తాను అనుకున్నది సాధించారు. తన తల్లిదండ్రులు గర్వపడేంతా ఎదిగారు. మనోజ్ గెలుపుపై తన తల్లిదండ్రులు, తన గురువు అయిన డీఎస్‌పీ దుష్యంత్ తమ గర్వాన్ని వ్యక్తం చేశారు.
కష్టపడితే ఏదైనా సాధించవచ్చు...
అతని విజయానికి కారణాలు... పట్టుదల, ఓర్పు, స్నేహితుల, కుటుంబ సభ్యుల సహకారం, గురువుల శిక్షణతోపాటు అందరి ప్రోత్సాహం. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వెనక్కి తగ్గకుండా మనోజ్ కుమార్ శర్మ యువతకు ఒక ఆదర్శంగా నిలిచాడు. అతని సక్సెస్ జర్నీతో మనం నేర్చుకోవాల్సింది... కష్టపడితే ఏదైనా సాధించవచ్చు.. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా వెనక్కి తగ్గకూడదు.
Tags
- Success Story
- manoj kumar sharma
- IPS Success Story
- inspirational journey
- ips manoj kumar sharma
- shraddha joshi
- Deputy Commissioner
- dsp dushyanth
- motivational life story in telugu
- motivations in ips journey
- UPSC Exams
- results of upsc exams
- stories for students upsc exams
- motivational story of IPS officer in telugu
- SuccessStory
- inspirational story of youth
- sakshi education success story