Skip to main content

Success Story : సామాన్యుడు కాదు.. ఏకంగా రూ.కోటి జీతం కొట్టాడిలా.. కానీ..

పట్టదల, అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే.. పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వారితో సమానంగా వేతనం తీసుకోవచ్చని నిరూపించాడు ఈ యువ‌కుడు. ఈ విద్యార్థి.. ఐఐఎం, ఐఐటీలు వంటవి ఏం చెయ్యలేదు.
BTech student Mahipal Seju one core salay package Success Story

కానీ వేతనంగా ఏకంగా కోటి రూపాయల వార్షిక ప్యాకేజిని అందుకుంటున్నాడు. మరీ అంత వేతనం ఎలా? అని అనుకుంటున్నారా!.. పనిచేసే అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే పెద్ద పెద్ద డిగ్రీలు చేయాల్సిన పని లేదు అని నిరూపించాడు ఈ భారతీయ విద్యార్థి. ఈ విద్యార్థి పేరు.. మహిపాల్ సేజు. ఈ నేప‌థ్యంలో మహిపాల్ సేజు స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం :  
మహిపాల్ సేజు.. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే బార్మర్‌ అనే చిన్న జిల్లాలో నివసిస్తున్నాడు.  మహిపాల్ సేజు భార‌త్‌కు చెందిన వారు. ఓ జపాన్‌ కంపెనీ నుంచి ఏకంగా కోటి రూపాయల వార్షిక ప్యాకేజీని అందుకుని రికార్డు సృష్టించాడు.

☛ Samhita Microsoft Job Rs.52 lakh Salary :లక్కీ ఛాన్స్ అంటే ఈమెదే.. ప్ర‌ముఖ కంపెనీలో జాబ్.. రూ. 52 లక్షల జీతం.. ఎలా అంటే..?

 Success Story : నాడు క్లాసురూమ్ నుంచి బయటికి వ‌చ్చా.. నేడు వేల కోట్లు సంపాదించా..!

ఎడ్యుకేష‌న్ :
మహిపాల్ సేజు.. ఏమి ఐఐఎం, ఐఐటీ స్టూడెంట్‌ కాదు. అందరిలానే బీటెక్‌ డిగ్రీ పూర్తి చేసి ఇంత పెద్ద మొత్తంలో వేతనం అందుకుని ఆశ్చర్యపరిచాడు. కేవలం పట్టదల, అంకితభావం, మంచి నైపుణ్యం ఉంటే.. పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన వారితో సమానంగా వేతనం తీసుకోవచ్చని నిరూపించాడు.

మహిపాల్‌.. జోథ్‌పూర్‌లోని బార్మర్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో  బీటెక్‌ పూర్తిచేశాడు. అయితే బీటెక్‌ చదువుతుండగానే 2019లో ఓ ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీ ద్వారా జపాన్‌లో నగోయాలోని ఒక కంపెనీలో రూ.30 లక్షల ప్యాకేజీతో మొదటి ఉద్యోగాన్ని సంపాదించాడు. మళ్లీ మూడేళ్ల తర్వాత జపాన్‌లోని టోక్యోలో మరో కంపెనీతో ఏకంగా రూ.1 కోటి వార్షిక ప్యాకేజ్‌ ఆఫర్‌ అందుకుని రికార్డు సృష్టించాడు.

☛ Success Story : రూ.60 లక్షల జీతంతో జాబ్ కొట్టా.. 67,000 మందిని ఓడించి.. ఎలా అంటే..?

నిజం చెప్పాలంటే...

Mahipal Seju salary hike news telugu

మహిపాల్‌ ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో మెకానికా కార్పొరేషన్ అనే కంపెనీకి ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద పెద్ద‌ చదువులు చదవలేదని బాధపడాల్సిన పనిలేదు. ప్రస్తుత పరిస్థితులకు అవసరమయ్యే స్కిల్స్‌ సంపాదించుకుంటే పెద్ద మొత్తంలో వేతనాలు అందుకోవచ్చని మహిపాల్‌ చేసి చూపించాడు. నిజం చెప్పాలంటే ఫోకస్‌ కరెక్ట్‌గా ఉండి, పనిపై అంకితా భావం ఉంటే ఏ నేపథ్యం నుంచి వచ్చినా కోట్లలో వేతనం అందుకోగలమని చాటి చెప్పాడు, పైగా అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మహిపాల్‌ సేజు. నేటి విద్యార్థుల‌కు మహిపాల్ సేజు స‌క్సెస్ జ‌ర్నీ స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంది.

☛ ఇలాంటి మ‌రిన్ని స‌క్సెస్ స్టోరీల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 08 Jan 2024 05:54PM

Photo Stories